Kia India | ప్రీ బుకింగ్స్‌లో కియా న్యూ సెల్టోస్ రికార్డు.
Kia India విధాత: తొలిరోజు కలెక్షన్‌లను బట్టి సినిమా హిట్టా ఫట్టా అని చెప్పినట్టే ప్రీ బుకింగ్‌ల సంఖ్యను బట్టి కార్ల విషయంలో ఒక అంచనాకు రావొచ్చు. తాజాగా కియా రూపొందించిన న్యూ సెల్టోస్ కార్లకు ప్రీ బుకింగులను ఓపెన్ చేయగా… నంబర్లలో అది దూసుకుపోతోంది. శుక్రవారం ఒక్క రోజే సుమారు 13,424 బుకింగ్‌లు వచ్చినట్లు ఆ సంస్థ వెల్లడించింది. సెమీ ఎస్‌యూవీ శ్రేణిలోకి వచ్చే సెల్టోస్ బ్రాండ్.. కియా ఇండియాకు చాలా కీలకమైనది. మొత్తం ఆ […]

Kia India
విధాత: తొలిరోజు కలెక్షన్‌లను బట్టి సినిమా హిట్టా ఫట్టా అని చెప్పినట్టే ప్రీ బుకింగ్‌ల సంఖ్యను బట్టి కార్ల విషయంలో ఒక అంచనాకు రావొచ్చు. తాజాగా కియా రూపొందించిన న్యూ సెల్టోస్ కార్లకు ప్రీ బుకింగులను ఓపెన్ చేయగా… నంబర్లలో అది దూసుకుపోతోంది. శుక్రవారం ఒక్క రోజే సుమారు 13,424 బుకింగ్‌లు వచ్చినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
సెమీ ఎస్‌యూవీ శ్రేణిలోకి వచ్చే సెల్టోస్ బ్రాండ్.. కియా ఇండియాకు చాలా కీలకమైనది. మొత్తం ఆ సంస్థ అమ్మకాల్లో దీని వాటానే 50 శాతం. జులై 14 నుంచి ఈ కారుకు ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. కియా ఇండియా అధికార వెబ్‌సైట్, అధీకృత డీలర్ల వద్ద నేరుగా ఈ కారును ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. దీని కోసం సమారు 25 వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
Witness the ultimate battle to reclaim the title of the Badass.
Because once the Badass is reborn, there’s no looking back!
Pre-book #TheNewSeltos now.#Kia #KiaIndia #KiaSeltos #Seltos #Badass #BadassByDesign #TheNextFromKia #TheBadassReborn #MovementThatInspires
— Kia India (@KiaInd) July 14, 2023
ఈ ఆర్డర్లపై కియా ఇండియా ఎండీ, సీఈఓ టా జిన్ పార్క్ స్పందించారు. సెల్టోస్ గౌరవాన్ని న్యూ సెల్టోస్ ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకాన్ని ప్రీ బుకింగ్స్ కలిగించాయని సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌లో మిడ్ ఎస్‌యూవీ విభాగంలో సెల్టోస్ ఒక బెంచ్ మార్క్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.