Vignesh Shivan | ‘బేబీ’ రెండక్షరాల సినిమానే కానీ విజయం తాలుకా సౌండింగ్ మాత్రం దద్దరిల్లిపోతోంది. ఈమధ్య కాలంలో ఇలా చిన్న సినిమాలే.. మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తూ.. గొప్ప పేరు తెచ్చుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా ఇటీవల వచ్చిన ‘బలగం’ మూవీ అయితే ఇది తెలంగాణ సంప్రదాయాన్ని మూలంగా చేసుకుని సక్సెస్ అయితే, మరి ‘బేబీ’ మూవీనో గాయపడిన ప్రతి గుండెనూ తాకింది. యూత్ ఒక్కరే కాదు.. ప్రేమ పుట్టి అందుకోలేనివారు, ప్రేమలో విఫలమైనవారు, అలాగే మోసపోయినవారు.. […]
Vignesh Shivan |
‘బేబీ’ రెండక్షరాల సినిమానే కానీ విజయం తాలుకా సౌండింగ్ మాత్రం దద్దరిల్లిపోతోంది. ఈమధ్య కాలంలో ఇలా చిన్న సినిమాలే.. మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తూ.. గొప్ప పేరు తెచ్చుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా ఇటీవల వచ్చిన ‘బలగం’ మూవీ అయితే ఇది తెలంగాణ సంప్రదాయాన్ని మూలంగా చేసుకుని సక్సెస్ అయితే, మరి ‘బేబీ’ మూవీనో గాయపడిన ప్రతి గుండెనూ తాకింది. యూత్ ఒక్కరే కాదు.. ప్రేమ పుట్టి అందుకోలేనివారు, ప్రేమలో విఫలమైనవారు, అలాగే మోసపోయినవారు.. ఇలా వాళ్ళు వీళ్లనేం తేడా లేకుండా అంతా కనెక్ట్ అయిపోయారు. అందరికీ ఏదో సందర్భంలో ఇలాంటి జ్ఞాపకం ఉండే ఉంటుందనే కోణంలో ‘బేబీ’ వారి గుండెను తాకింది.. బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది.
ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ పాత్రలకు తగ్గట్టుగా ఒదిగిపోయారు. సాంగ్స్, పోస్టర్‌తో ప్రేక్షకులకు ఏదో కొత్త కాస్సెప్ట్తో వస్తుందనే బజ్ క్రియేట్ చేసి, రిలీజ్ కి ముందే ఆకట్టుకుందీ చిత్రం. ఇక కలెక్షన్స్ విషయంలోనూ ‘బేబీ’ ఓ రేంజ్లో దూసుకుపోయింది. ఇప్పటి వరకూ ఈ మూవీ రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్ళు చేసినట్లుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. జూలై 14న రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ అదే రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుండటం విశేషం.
అలాగే కలెక్షన్స్ ఎలా కుమ్మేస్తున్నాయో.. ‘బేబీ’ సినిమాకు ప్రసంశలు కూడా అదే స్థాయిలో అందుతున్నాయి. ఈమధ్య డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘బేబీ’ మూవీ టీం కి బెస్ట్ విశెష్ తెలియజేసారు. తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కూడా ‘బేబీ’ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ దర్శకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బేబి’ 10 రోజుల వసూళ్ళ పోస్టర్‌ను పోస్ట్ చేసి.. ‘బేబీ’ సినిమా తనకు నచ్చిందని.. టీం అందరికీ గ్రాండ్ సక్సెస్‌కి కంగ్రాట్స్ చెబుతూ.. కథతో పాటు డైలాగ్స్ కూడా బాగా నచ్చాయంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు.
అయితే ఓ తమిళ దర్శకుడైన విఘ్నేష్ శివన్ ప్రత్యేకించి ఓ తెలుగు సినిమాపై ఇలా ప్రశంసలు కురిపించడంతో.. ఈ సినిమాకు ఆయన అంతలా కనెక్ట్ కావడానికి అతని జీవితంలో ఇలాంటి కోణం ఉందేమోననేలా కామెంట్స్ చేస్తున్నారు. ఆ కోణంలో ఆలోచిస్తే.. నిజంగానే ఉందనిపిస్తుంది.
విఘ్నేష్ భార్య నయనతార జీవితంలో దాదాపు మూడు, నాలుగు ప్రేమలు మధ్యలో ఆగినవో, మొదలై పీకల్లోతు కూరుకుపోయి పెళ్ళి పీటల వరకూ వెళ్ళినవో ఉండటం కూడా ఓ కారణం కావచ్చేమో.. ముగ్గురు ప్రేమను వదులుకుని చివరికి తన జీవితంలోకి రావడం గుర్తుకొచ్చి ఇలా సపోర్ట్‌గా మాట్లాడాడేమోననేలా టాక్ వినబడుతుంది. ఈ విధంగా చూస్తే.. ‘బేబీ’ సినిమా నయనతార లైఫ్ స్టోరీ ఏమో అని కూడా అనిపిస్తుంది. ఏది ఏమైతే ఏం.. ‘లోగుట్టు పెరుమాళ్ళ కెరుక’ అన్నారు అందుకే. ప్రస్తుతానికైతే ‘బేబీ’ హవా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో కొనసాగుతుందన్నది మాత్రం నిజం.