Nayanthara’s Diwali With Chiru’s Family | శంకర వర ప్రసాద్ గారింట్లో నయనతార దీపావళి వేడుకలు.. వైరల్
మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరిగిన దీపావళి వేడుకల్లో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు తమ పిల్లలతో కలిసి పాల్గొన్నారు. 'మన శంకర వర ప్రసాద్ గారు' నటి అయిన నయనతార మెగాస్టార్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ చిరంజీవి ఇంట్లో 'మా ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగింది' అని పేర్కొన్నారు.
విధాత, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నివాసంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కుటుంబం దీపావళీ వేడుకలు వైరల్ గా మారాయి. చిరంజీవి నివాసంలో జరిగిన దీపావళి వేడుకల్లో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు, తమ ఇద్దరు పిల్లలు ఉయిర్ , ఉలగంతో కలిసి హాజరయ్యారు. తన దీపావళి వేడుకల నుండి కొన్ని అందమైన చిత్రాలను నయనతార ఎక్స్ వేదికగా పంచుకున్నారు. విఘ్నేష్, పిల్లలతో కలిసి నయనతార చిరంజీవితో దిగిన ఫోటోలను షేర్ చేశారు. “ఈ దీపావళి చాలా స్పెషల్‌గా గడిచింది. నా చుట్టూ ఉన్న మనుషులను చూస్తే నా ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగింది” అని నయనతార భావోద్వేగంగా పేర్కొన్నారు. మెగాస్టార్ నివాసంలో జరిగిన దీపావళి వేడుకలకు విక్టరి వెంకటేష్ సహా పలువురు టాలీవుడ్ నటీ నటులు, దర్శక, నిర్మాతలు హాజరయ్యారు.
ALSO READ : చిరంజీవి ఇంట దీపావళి సందడి : నాగార్జున, వెంకటేశ్, నయనతార హాజరు – ఫోటోలు వైరల్
నయనతార మెగాస్టార్ చిరంజీవితో గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో, ప్రస్తుతం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ నుంచి చిరు, నయనతారల మధ్య తీసిన మీసాల పిల్ల సాంగ్ భారీ వ్యూస్ అందుకుని సినిమాపై అంచనాలను పెంచింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram