Krrish 4 | అంతర్జాతీయ సినిమాల్లో కిడ్స్ దగ్గరి నుండి అన్ని తరహాల ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా కొన్ని వందల-వేల కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడే సూపర్ హీరో మూవీస్ అప్డేట్స్ కోసం వేచి చూడని వాళ్లుండరు. ఇండియాలో సూపర్ హీరో మూవీ అంటే కళ్ళకు కట్టినట్లు గుర్తొచ్చేది ‘క్రిష్’. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూపర్ హీరోగా నటించింది విలక్షణ నటుడైన హ్రితిక్ రోషన్. రెండు దశాబ్దాల క్రిందట 2003లో వచ్చిన తొలి సినిమా […]
Krrish 4 |
అంతర్జాతీయ సినిమాల్లో కిడ్స్ దగ్గరి నుండి అన్ని తరహాల ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా కొన్ని వందల-వేల కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడే సూపర్ హీరో మూవీస్ అప్డేట్స్ కోసం వేచి చూడని వాళ్లుండరు. ఇండియాలో సూపర్ హీరో మూవీ అంటే కళ్ళకు కట్టినట్లు గుర్తొచ్చేది ‘క్రిష్’. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూపర్ హీరోగా నటించింది విలక్షణ నటుడైన హ్రితిక్ రోషన్.
రెండు దశాబ్దాల క్రిందట 2003లో వచ్చిన తొలి సినిమా ‘కోయి మిల్ గయా’ ఈ క్రిష్ ఫ్రాంచైజీలో భాగంగా విడుదలై ప్రేక్షకులందరినీ అలరించింది. కిడ్స్ అయితే స్పైడర్ మాన్, సూపర్ మాన్ హీరోస్ లాగా క్రిష్‌ని హత్తుకొని, గుండెల్లో పెట్టుకున్నారు. ఈ మూవీ విజయవంతం కావడంతో దానికి సీక్వెల్ గా 2006లో ‘క్రిష్’ చిత్రాన్ని నిర్మించారు. 40 కోట్లతో రూపొందించబడిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మూడింతలయి 120 కోట్లు తెచ్చిపెట్టింది.
ఆ విధంగా క్రిష్ ఫ్రాంచైజీ మేకర్స్ అదే సక్సెస్ జోష్‌లో ‘క్రిష్ 2’, ‘క్రిష్-3’ని కూడా రూపొందించారు. ఇదయితే ఏకంగా 400 కోట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు తెచ్చిపెట్టడంతో ఇండియాలోనే భారీ కలెక్షన్లు వచ్చిన మూవీస్ లిస్ట్‌లో ‘క్రిష్-3’ మూవీ నిలిచిపోయింది. ఈ ఫ్రాంచైజీకి ఇండియన్ ప్రేక్షకులందరూ ఫ్యాన్స్ అయిపోయి తరువాత వచ్చే ‘క్రిష్-4’ మూవీ అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో క్రిష్ మూవీ దర్శకుడు, హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ ‘క్రిష్-4’ గురించి తాజాగా అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో ‘క్రిష్-4’ గురించి మాట్లాడుతూ.. ఈ మధ్య ప్రేక్షకులు అందరూ మిలియన్ డాలర్ బడ్జెట్ సినిమాలు చూడడానికి అలవాటు పడ్డారు. వాళ్ళని కాస్త నిరుత్సాహపరచినా కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది మేకర్స్‌కి.
ఏది వేస్టో, ఏది గొప్పో ఇట్లే పసిగట్టేయగలిగే అభిరుచుల్ని ప్రేక్షకులు సంపాందించుకున్నారు. కొన్ని బిగ్ బడ్జెట్ సినిమాల విషయంలో తేడా వస్తే సినిమా ప్రొడక్షన్‌కి అయిన ఖర్చులు కూడా మిగలకుండా పోతున్నాయి. అందుకే ఎక్కడా తగ్గకుండా భారీ అంచనాలతో.. ప్రేక్షకులకు కళ్ళకి కట్టే విధంగా ‘క్రిష్-4’ మూవీ వచ్చే ఏడాది 2024లో రానుందని రాకేష్ రోషన్ తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాం. ఈ సినిమాని ఇంకా అడ్వాన్స్డ్ గా తీయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాము, వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కావచ్చని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా హ్రితిక్ రోషన్ ప్రస్తుతం ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల కానుంది. అలానే ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయిన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్-2’లో కూడా హ్రితిక్ నటిస్తున్నారు. దీనిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తూ.. బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నారు. కాగా.. త్వరలోనే ‘క్రిష్4’కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని రాకేష్ రోషన్ తెలిపారు.