నిజాం కాలేజీలో అమ్మాయిల ఆందోళన.. స్పందించిన కేటీఆర్

Nizam College | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని నిజాం కాలేజీలో నాలుగైదు రోజుల నుంచి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం విదితమే. తమకు కేటాయించిన హాస్టల్ ను పీజీ విద్యార్థులకు అలాట్ చేయడంపై డిగ్రీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ చాంబర్ ను ముట్టడించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అమ్మాయిలను పోలీసులు అరెస్టు చేయడంతో.. పలు విద్యార్థి సంఘాలు నిజాం కాలేజీ ప్రిన్సిపల్ పై మండిపడ్డాయి. ఈ పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో మంత్రి […]

నిజాం కాలేజీలో అమ్మాయిల ఆందోళన.. స్పందించిన కేటీఆర్

Nizam College | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని నిజాం కాలేజీలో నాలుగైదు రోజుల నుంచి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం విదితమే. తమకు కేటాయించిన హాస్టల్ ను పీజీ విద్యార్థులకు అలాట్ చేయడంపై డిగ్రీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ చాంబర్ ను ముట్టడించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అమ్మాయిలను పోలీసులు అరెస్టు చేయడంతో.. పలు విద్యార్థి సంఘాలు నిజాం కాలేజీ ప్రిన్సిపల్ పై మండిపడ్డాయి.

ఈ పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బాసటగా నిలిచారు కేటీఆర్. ఈ విషయంలో జోక్యం చేసుకొని.. వెంటనే సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి కేటీఆర్ సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం.. హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని కేటీఆర్‌ పేర్కొన్నారు. సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్‌కు సూచించారు.