Rythubadi | నేడు ‘రైతుబడి’ డిజిటల్ మాసపత్రిక లాంచింగ్‌.. ఉత్తమ రైతులకు సన్మానం

Rythubadi | విధాత: ప్రారంభించిన అనతికాలంలోనే అంచనాలను అధిగమించి రైతాంగంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని చూరగొని వన్ మిలియన్ వీక్షకులను సాధించి తెలుగు రైతుల గుండెసడిగా నిలిచిన రైతుబడి డిజిటల్ మీడియా తన పురోగమనంలో మరో మైలురాయికి సిద్దమైంది. ఇప్పటిదాక రైతుబడి యూ ట్యూబ్ చానెల్‌, ఫెస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్ ల ద్వారా రైతాంగ విజయగాథలను ప్రపంచానికి అందించడంలో దిగ్విజయంగా ముందడుగు వేసిన వ్యవస్థాపకులు జూలకంటి రాజేందర్‌రెడ్డి రైతాంగానికి మరిన్ని సేవలందించే లక్ష్యంతో డిజిటల్ […]

Rythubadi | నేడు ‘రైతుబడి’ డిజిటల్ మాసపత్రిక లాంచింగ్‌.. ఉత్తమ రైతులకు సన్మానం

Rythubadi |

విధాత: ప్రారంభించిన అనతికాలంలోనే అంచనాలను అధిగమించి రైతాంగంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని చూరగొని వన్ మిలియన్ వీక్షకులను సాధించి తెలుగు రైతుల గుండెసడిగా నిలిచిన రైతుబడి డిజిటల్ మీడియా తన పురోగమనంలో మరో మైలురాయికి సిద్దమైంది.

ఇప్పటిదాక రైతుబడి యూ ట్యూబ్ చానెల్‌, ఫెస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్ ల ద్వారా రైతాంగ విజయగాథలను ప్రపంచానికి అందించడంలో దిగ్విజయంగా ముందడుగు వేసిన వ్యవస్థాపకులు జూలకంటి రాజేందర్‌రెడ్డి రైతాంగానికి మరిన్ని సేవలందించే లక్ష్యంతో డిజిటల్ మాస పత్రికను ప్రారంభించనుండటం విశేషం.

రేపు శనివారం హైద్రాబాద్ రవీంద్రభారతీ ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు జరుగనున్న రైతుబడి డిజిటల్ మాస పత్రిక లాంచింగ్‌ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఏపీ, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు కే.గోవర్ధన్‌రెడ్డి, ఎస్‌. నిరంజన్‌రెడ్డిలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రైతుబడి డిజిటల్ మాస పత్రిక లాంచింగ్‌తో పాటు రైతుబడి గేయ ఆవిష్కరణ, ఉత్తమ రైతులకు, వ్యవసాయ సేవకులకు సన్మానం చేయనున్నారు.