Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దైవబలం సదా రక్షిస్తోంది. ఇంటా బయట ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు సమర్ధవంతంగా అధిగమిస్తారు. మనోబలంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో వినయంగా నడుచుకుంటే మంచిది. ఆర్థిక పరమైన ఉన్నతి ఉన్నప్పటికీ ఖర్చులు బాగా పెరుగుతాయి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కాలం మీకు సంపూర్ణంగా సహకరిస్తోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఉద్యోగంలో శ్రద్ధతో పనిచేస్తే తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ప్రారంభించిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ప్రణాళిక లోపంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉండవచ్చు. ఆశించిన ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఖర్చులు నియంత్రించుకోండి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారంలో ధనయోగం ఉంది. ముందుచూపుతో, చక్కని ప్రణాళికతో ఖర్చులు అదుపులో ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలకు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు ఆనందం కలిగిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనధాన్యవృద్ధి ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. గొప్పవారితో ఏర్పడే పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, ఉద్యోగులు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సమస్యలు ఒత్తిడి కలిగిస్తాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ కృషి ఫలిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతులకు కూడా అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి లాభాలు గడిస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాలు ఆహ్లాదంగా సాగుతాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో పట్టుదలతో కృషి చేస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. కీలక వ్యవహారాల్లో బంధుమిత్రుల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. డబ్బు ఆచి తూచి ఖర్చు చేయండి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. వృత్తి పరమైన సమస్యలు ఆందోళన కల్గిస్తాయి. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ఖర్చులు నియంత్రించండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి కొత్త ప్రాజెక్టులు ప్రారంబించకూడదు, ప్రయాణాలు చేయకూడదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు తగ్గించుకోండి. అస్థిర బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు అశాంతి కలిగిస్తాయి. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే మంచిది. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. కుటుంబ సభ్యులతో గొడవలు ఆందోళనకు కలిగిస్తాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram