ఒకప్పుడు సినిమాలలో ముద్దు సీన్స్ అనేవి ఏ మాత్రం కనిపించేవి కావు. ఎలాంటి రొమాంటిక్ చిత్రాలు అయిన కూడా పద్దతిగానే తీసేవారు. కాని హాలీవుడ్ సినిమాల ఇన్సిపిరేషన్‌తో ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాషా చిత్రాలలో లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పట్లో ఏదన్నా లిప్ లాక్ సీన్ ఒకటి కనిపిస్తే అమ్మో ఆ సినిమాలో లిప్ లాక్ సీన్ ఉందా అంటూ తెగ చర్చలు జరిపేవారు. కాని ఇప్పుడు అది కామన్ అయిపోయింది. పెద్ద సినిమాలు లేవు, చిన్న సినిమాలు లేవు అన్నింట్లో కూడా లిప్ లాక్ ఉండాల్సిందే. ఇక కథని బట్టి దర్శకులు లిప్ లాక్ సీన్స్ పెట్టడం వాటికి హీరోయిన్స్ కూడా సై అనడంతో దాదాపు ప్రతి సినిమాలో లిప్ లాక్ సీన్స్ చూస్తూనే ఉన్నాం.
పాతికేళ్ల ముందు వరకు ముద్దు సన్నివేశాలు అంటే చాలా రాద్దాంతం చేయడమే కాకుండా దాని గురించి తెగ ముచ్చటించుకునేవారు. ఆ సీన్‌లో నటించిన వారిని తెగ విమర్శించే వారు కూడా. అయితే 1933 లో ఒక సినిమాలో లిప్ లాక్ సీన్ కనిపించడంతో దానిపై చాలా డిస్కషన్ నడిచింది. ఇండియన్ సినిమాలో మొదటి ముద్దు సీన్ గా కర్మ సినిమాలో దేవికారాణి మరియు హిమాన్షు రాయ్ లు పెట్టిన ముద్దు సీన్ నిలిచింది అని చెప్పాలి. స్వాతంత్య్రం కూడా రాని భారతంలో దేవికారాణి ముద్దు సన్నివేశంలో నటించి పెద్ద సాహసం చేసింది అని చెప్పాలి. అసలు ఆ రోజుల్లో అలాంటి సన్నివేశాలని పెడతారని ఎవరు ఊహించి కూడా ఉండరు.
కర్మ అనే సినిమాలో దేవికారాణి ముద్దు సీన్ లో నటించడంతో అందరు అవాక్కయ్యారు. అయితే సినిమాలో దేవికా భర్త హిమాన్షు రాయ్ కాగా, అతనికి కథ పరంగా ముద్దు ఇవ్వడంతో కొందరు పర్వాలేదు అన్నట్లుగా కామెంట్స్ చేస్తే.. ఎంత భర్త అయితే మాత్రం నలుగురు చూస్తూ ఉండగా ఏంటి ఆ ముద్దులు అన్నట్లుగా విమర్శలు గుప్పించారు. ఈ చిత్రంలో భార్య భర్తలు ఇద్దరు ఏకంగా నాలుగు నిమిషాల పాటు అధర చుంబన సన్నివేశం లో కనిపించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అప్పట్లో ఆ సన్నివేశం అందరిని ఆశ్చర్యపరచగా, ఇప్పుడు మాత్రం లైట్ అన్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి.