Jharkhand  Encounter: జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టులు హతం

జార్ఖండ్ రాష్ట్రం భారీ ఎన్​కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు.

  • By: Somu    latest    Apr 21, 2025 12:04 PM IST
Jharkhand  Encounter: జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టులు హతం

Jharkhand  Encounter :  జార్ఖండ్ రాష్ట్రం భారీ ఎన్​కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. సోమవారం ఉదయం బొకారా జిల్లా లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్‌ లో ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌, రాష్ట్ర పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారని అధికారులు తెలిపారు.

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో ఎస్‌ఎల్‌ఆర్‌, రెండు ఇన్సాస్‌ రైఫిల్స్ స్వాధీనం, ఒక పిస్టల్​ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు. అయితే భద్రతా దళాల్లో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు.