Malla Reddy |
రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రి మల్లారెడ్డి అంటే తెలియరు వారు ఉండరు. రాజకీయాల్లో తనకంటూ ఓ డిఫరెంట్ స్టైల్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ప్రజంట్ తెలంగాణలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. సినిమా ఫంక్షన్లలో, పొలిటికల్ మీటింగ్స్‌లో మల్లారెడ్డి ఇచ్చే ప్రసంగాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. రాజకీయ ప్రేక్షకులతో పాటు మాములు జనాల్ని కూడా తనదైన డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు.
రీసెంట్ గా పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డ.. బోర్‌వెల్ నడిపించినా.. చిట్ ఫండ్స్ పెట్టిన.. సక్సెస్ అయిన’ అనే డైలాగ్ ఏ రేంజ్‌లో ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. ఇక ఎన్నో సందర్భాల్లో మంత్రి కేటీఆర్ సైతం మల్లారెడ్డి స్పీచ్‌ను మ్యాచ్ చేయడం కష్టమని చెప్పిన విషయం కూడా వైరల్ అయ్యింది. మల్లారెడ్డి రాజకీయాల నుంచి సిల్వర్ స్క్రీన్ వైపు తన రూటు మార్చినట్లు తెలుస్తుంది.
ఇగా ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి సినీ ఇండస్ట్రీకి కూడా సెటబ్రీటీగా మారాడు. కొత్తగా సినిమాలు విడుదల చేస్తున్న వారు మంత్రితో ఆడియో ,ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు. మరికొంద రైతే సినిమా గురించి మ్త్రితో ఇంటర్యూలు చేయించి వదులుతున్నారు. ఆయన కాలేజీలలో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ సంఘటనలన్నీ కూడా మంత్రకి సినిమాపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది.
అంతేకాదు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి.. తెలంగాణ నేటివిటీలో వచ్చే విధంగా నాలుగు సినిమాలను కూడా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ముఖ్య అతిథిగా హజరైన ఓ ఫంక్షన్‌లో తన మనసులోని మాటను బయట పెట్టారు. అవకాశమిస్తే మీతో సినిమా తీస్తానని కూడా అన్నారు.
ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోని పలువురు దర్శకులతో కథల గురించి మల్లారెడ్డి డిస్కస్ చేశారట. వచ్చే ఎన్నికలు తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన ఇమేజ్ ను మరింతగా పెంచుకోనున్నారని తెలుస్తుంది. సో అన్నీ లెక్కల ప్రకారం చూస్తే.. డిసెంబర్ నెలలో మల్లారెడ్డి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఓ సినిమాకు క్లాప్ కొట్టడం పక్కా అనే వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణ నేపథ్యంలో సినిమాలు తీయాలని మల్లారెడ్డి అనుకుంటున్నారు. అందుకే ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి రచయితలతో కూడా మాట్లాడి మంచి కథను ప్రిపేర్ చేయిస్తున్నారట. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే మల్లారెడ్డి యాక్టింగ్ తో కూడా స్క్రీన్ పై కనిపిస్తారని అనడంలో ఎలాంటి డౌట్ లేదు.
ఎందుకంటే ఇప్పటికే మల్లారెడ్డికి సినీ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అనే విషయం, సినిమాల్లో నటించాలనే ఆలోచన ఈ రెండు కూడా ఎప్పట్నుండో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయనే విషయంలో ఎన్నో సందర్భాల్లో చెప్పారు. చిరంజీవితో కలిసి సినిమాల్లో నటిస్తానని కూడా అన్నారు.