యాక్సిడెంట్ కేసులో అరెస్ట్.. ఎస్ఐ చెవి కొరికిన వ్యక్తి
Kerala | ఓ వ్యక్తి యాక్సిడెంట్ కేసులో అరెస్టు అయ్యాడు. అతన్ని పోలీసు స్టేసన్‌కు తరలిస్తుండగా, సబ్ ఇన్‌స్పెక్టర్ చెవిని కొరికేశాడు. బాధిత ఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కేరళలోని కాసర్‌గాడ్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్టేనీ రోడ్రిగుజ్ అనే వ్యక్తి తన బైక్‌పై వెళ్తూ మరో వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో వాహనదారుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి ఎస్ఐ విష్ణు ప్రసాద్ తన బృందంతో రోడ్డుప్రమాదం జరిగిన ప్రాంతానికి […]

Kerala | ఓ వ్యక్తి యాక్సిడెంట్ కేసులో అరెస్టు అయ్యాడు. అతన్ని పోలీసు స్టేసన్‌కు తరలిస్తుండగా, సబ్ ఇన్‌స్పెక్టర్ చెవిని కొరికేశాడు. బాధిత ఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కేరళలోని కాసర్‌గాడ్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. స్టేనీ రోడ్రిగుజ్ అనే వ్యక్తి తన బైక్‌పై వెళ్తూ మరో వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో వాహనదారుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి ఎస్ఐ విష్ణు ప్రసాద్ తన బృందంతో రోడ్డుప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నాడు. ప్రమాదానికి కారణమైన స్టేనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమ వాహనంలో ఎక్కించుకుని పీఎస్‌కు బయల్దేరారు.
ఎస్ఐ ప్రసాద్ ముందు సీట్లో కూర్చోగా, వెనుకాల సీట్లు స్టేనీ కూర్చున్నాడు. ఉన్నట్టుండి.. ఎస్ఐ కుడి చెవిని స్టేనీ గట్టిగా కొరికాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఎస్ఐని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్టేనీపై పోలీసులు కేసు నమోదు చేశారు.