KanwarYatra2023 | అభిన‌వ శ్రవ‌ణ కుమారులు! తల్లిని మోసుకుంటూ.. 150కి.మీ కావడి యాత్ర

KanwarYatra2023 | విధాత‌: కుటుంబ సంబంధాలు స‌న్న‌గిల్లుతూ , తల్లిదండ్రుల పట్ల ప్రేమ, ఆప్యాయ‌త‌లు కొర‌వ‌డి.. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్లు న‌డుస్తున్న ఈ రోజుల్లో కూడా ఇంకా శ్రవ‌ణ కుమారులు ఉన్నారంటే ఆశ్చర్యమే. ఆ నాటి శ్రవ‌ణ‌కుమారుని క‌థ మ‌నంద‌రికీ తెలుసు. ఇప్పటి స‌మాజం లోనూ అటువంటి వారు ఉన్నార‌ని చెప్పేందుకు ఈ యువ‌కుల ఆద‌ర్శమే నిద‌ర్శ‌నం. ఉత్త‌రాఖండ్‌ను దేవ‌భూమి అని పిల‌వ‌డం ప‌రిపాటి. ఈ యువ‌కులిద్దరూ ఆ దేవ‌భూమికి చెందిన‌ వారే కావ‌డం […]

KanwarYatra2023 | అభిన‌వ శ్రవ‌ణ కుమారులు! తల్లిని మోసుకుంటూ.. 150కి.మీ కావడి యాత్ర

KanwarYatra2023 |

విధాత‌: కుటుంబ సంబంధాలు స‌న్న‌గిల్లుతూ , తల్లిదండ్రుల పట్ల ప్రేమ, ఆప్యాయ‌త‌లు కొర‌వ‌డి.. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్లు న‌డుస్తున్న ఈ రోజుల్లో కూడా ఇంకా శ్రవ‌ణ కుమారులు ఉన్నారంటే ఆశ్చర్యమే. ఆ నాటి శ్రవ‌ణ‌కుమారుని క‌థ మ‌నంద‌రికీ తెలుసు. ఇప్పటి స‌మాజం లోనూ అటువంటి వారు ఉన్నార‌ని చెప్పేందుకు ఈ యువ‌కుల ఆద‌ర్శమే నిద‌ర్శ‌నం. ఉత్త‌రాఖండ్‌ను దేవ‌భూమి అని పిల‌వ‌డం ప‌రిపాటి.

ఈ యువ‌కులిద్దరూ ఆ దేవ‌భూమికి చెందిన‌ వారే కావ‌డం మ‌రో విశేషం. ప‌విత్ర గంగాన‌ది ఒడ్డు నుంచి ఈ యువ‌కులు త‌మ కావ‌డి యాత్ర ప్రారంభించారు. వారు 150 కిలోమీట‌ర్ల దూరంలోని హ‌రిద్వార్‌కు చేరాలి. ఈ యువ‌కుల భుజాల‌పై ఉన్న కావ‌డిలో ఒక‌వైపు గంగాజ‌ల కుండ‌లు, మ‌రోవైపు త‌మ వృద్ధ మాతృమూర్తిని మోస్తూ బ‌య‌లుదేరారు.

ఈ యువ‌కుల కావ‌డి ఫోటోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యాయి. నెటిజ‌న్లు వీరిని బాగా లైక్ చేశారు. ఈ యువ‌కుల్లో ఒక‌రు గ‌మ్యం చేరేవ‌ర‌కు మోస్తానని అంటే, అలా తాను మోయడానికీ ఇబ్బంది లేదని మరో యువకుడు చెబుతున్నారు. మొత్తానికి ఇద్దరూ తమ తల్లిని కావడిలో తీసుకుని వెళుతున్నారు.