ప్రియురాలి కోసం సముద్రంలోకి దూకిన ప్రియుడు.. ఎందుకంటే..?
Love Propose | విధాత: ఓ జంట నడి సముద్రంలో పడవపై షికారు చేస్తోంది. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఆ జంట ఆలింగనాల్లో మునిగిపోయింది. ఇక తన ప్రేయసికి ప్రపోజ్ చేసే సమయం రానే వచ్చింది. ప్రియురాలి ఎదుట ఒంటి కాలిపై కూర్చొని ఆమెకు ఉంగరం తొడిగేందుకు యత్నించాడు ప్రియుడు. కానీ ఉంగరం సముద్రంలో పడిపోయింది. దీంతో ఆ లవర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సముద్రంలోకి దూకేశాడు. తన ప్రేయసి కోసం తెచ్చిన ఉంగరాన్ని నీటిలో […]

Love Propose | విధాత: ఓ జంట నడి సముద్రంలో పడవపై షికారు చేస్తోంది. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఆ జంట ఆలింగనాల్లో మునిగిపోయింది. ఇక తన ప్రేయసికి ప్రపోజ్ చేసే సమయం రానే వచ్చింది. ప్రియురాలి ఎదుట ఒంటి కాలిపై కూర్చొని ఆమెకు ఉంగరం తొడిగేందుకు యత్నించాడు ప్రియుడు. కానీ ఉంగరం సముద్రంలో పడిపోయింది.
దీంతో ఆ లవర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సముద్రంలోకి దూకేశాడు. తన ప్రేయసి కోసం తెచ్చిన ఉంగరాన్ని నీటిలో నుంచి తన చేతుల్లోకి తీసుకోగలిగాడు. ఆ రింగ్‌ను పడవలో ఉన్న మరో వ్యక్తికి అందజేశాడు. అనంతరం అతని సహాయంతో పడవలోకి మెల్లిగా రాగలిగాడు.
ఇక తన ప్రియురాలి దగ్గరకు చేరుకుని, ఆ ఉంగరాన్ని చేతి వేలికి తొడిగి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఆమె అతని ప్రేమను అంగీకరించి, ముద్దులతో ముంచెత్తింది. ఆలింగనాలతో హత్తుకుపోయారు. ఈ వీడియోను ప్రేమికుడు స్కాట్ క్లెయిన్ తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశాడు.
తన ప్రియురాలు సుజి టక్కర్‌కు ప్రపోజ్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపాడు. ఇది 100 శాతం నిజం, 100 శాతం నా అదృష్టం, 100 శాతం ఎప్పటికీ మరిచిపోలేను అని క్లెయిన్ రాశాడు. క్లెయిన్ ప్రేమపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రియురాలి కోసం ఎంత సాహసం చేశాడో.. గ్రేట్ లవ్ అని కొనియాడుతున్నారు.