Viral: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాచి.. హాస్టల్ లోకి! అడ్డంగా దొరికిండు

  • By: sr    videos    Apr 12, 2025 11:37 AM IST
Viral: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాచి.. హాస్టల్ లోకి! అడ్డంగా దొరికిండు

Viral:  విధాత: ప్రేమపిచ్చి ముదిరిందో.. కామతురాణం.. న భయం.. న లజ్జ అనుకున్నాడో గాని ఓ యువకుడు ఏకంగా తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్ కేసులో తన హాస్టల్ రూమ్ కు తీసుకెళ్లే సాహసం చేశాడు. అయితే ఈ క్రమంలో అతను యువతితో పాటు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఓ యవకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను విడిచి ఉండలేక ఆమెను తనతో పాటు హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు తెగించాడు. ఆమెను ఓ పెద్ద సూట్ కేసులోప్యాక్ చేశాడు. సూట్ కేసులో ఆమెను తీసుకెళ్తూ హాస్టల్ లోకి ప్రవేశించాడు. అయితే సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి లగేజ్ సూట్ కేసును చెక్ చేశారు. ఆ సూట్‌కేస్‌ను తెర‌వ‌గా లోప‌ల‌ అమ్మాయి కనిపించ‌డంతో నిర్ఘాంత‌పోయారు. వెంట‌నే సూట్‌కేస్‌లోంచి ఆ అమ్మాయిని బ‌య‌ట‌కు తీశారు.

ఆ స‌మ‌యంలో తోటి విద్యార్థులు ఈ సంఘ‌ట‌న‌ను వీడియో తీశారు. ఆ త‌ర్వాత వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో వైర‌ల్‌గా మారింది. వారిద్దరినీ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. వయసు తాపం ఎంతటి తప్పునైనా చేయిస్తుందని కొందరు..ఇదేమి ప్రేమ పైత్యంరా బాబు అని మరికొందరు..సూట్ కేసు కంపెనీకి మంచి అడ్వైర్టెజ్ మెంట్ అని ఇంకొకరు కామెంట్లు పెడుతున్నారు.