Mancherial | చికెన్ వండలేదని.. భార్యను కడ తేర్చిన భర్త

Mancherial విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేటలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కనికరం లేకుండా భర్త గొడ్డలితో హత్య చేశాడు. కిష్టంపేటకు చెందిన గాలిపెల్లి పోశం, శంకరమ్మ భార్యాభర్తలు. ఇద్దరి మధ్య గత కొంత కాలం నుండి గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. పోశం నిన్న సాయంత్రం చికెన్ వండాలని చెప్పినప్పటికీ భార్య వేరే కూర వండిన నేపథ్యంలో దానిని మనసులో పెట్టుకొని అర్ధరాత్రి నిద్రిస్తున్న శంకరమ్మ పై విచక్షణ రహితంగా […]

  • By: Somu    latest    Jul 13, 2023 10:21 AM IST
Mancherial | చికెన్ వండలేదని.. భార్యను కడ తేర్చిన భర్త

Mancherial

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేటలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కనికరం లేకుండా భర్త గొడ్డలితో హత్య చేశాడు.

కిష్టంపేటకు చెందిన గాలిపెల్లి పోశం, శంకరమ్మ భార్యాభర్తలు. ఇద్దరి మధ్య గత కొంత కాలం నుండి గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

పోశం నిన్న సాయంత్రం చికెన్ వండాలని చెప్పినప్పటికీ భార్య వేరే కూర వండిన నేపథ్యంలో దానిని మనసులో పెట్టుకొని అర్ధరాత్రి నిద్రిస్తున్న శంకరమ్మ పై విచక్షణ రహితంగా గొడ్డలితో దాడి చేసి చంపాడు.

నిందితుడు హత్య చేసి పరారీలో ఉన్నట్లు సమాచారం. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు