మూసాపేటలో మెట్రో రైలు కింద దూకి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

Hyderabad | హైద‌రాబాద్ మూసాపేట‌లో దారుణం జ‌రిగింది. గురువారం రాత్రి 9:16 గంట‌ల‌కు ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి వేగంగా వ‌స్తున్న మెట్రో రైలు కింద దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. టికెట్ తీసుకోకుండానే స్టేష‌న్‌లోకి ప్ర‌వేశించిన ఆ వ్య‌క్తి.. రైలు రాగానే దాని కింద‌కు దూకాడు. రైలు ఇంజిన్‌కు ఢీకొన‌డంతో.. దీంతో ప్లాట్ ఫామ్, రైలు మ‌ధ్య‌లో ప‌డి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాలు అక్క‌డున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి […]

మూసాపేటలో మెట్రో రైలు కింద దూకి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

Hyderabad | హైద‌రాబాద్ మూసాపేట‌లో దారుణం జ‌రిగింది. గురువారం రాత్రి 9:16 గంట‌ల‌కు ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి వేగంగా వ‌స్తున్న మెట్రో రైలు కింద దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. టికెట్ తీసుకోకుండానే స్టేష‌న్‌లోకి ప్ర‌వేశించిన ఆ వ్య‌క్తి.. రైలు రాగానే దాని కింద‌కు దూకాడు. రైలు ఇంజిన్‌కు ఢీకొన‌డంతో.. దీంతో ప్లాట్ ఫామ్, రైలు మ‌ధ్య‌లో ప‌డి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ దృశ్యాలు అక్క‌డున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.