Manchiryala | దొంగతనానికి వెళ్లి.. బావిలో పడి దొంగ మృతి

Manchiryala విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లోకి దొంగ చోరీ చేయ‌డానికి వెళ్లాడు. అయితే ఆ ఇంటి వారు మెలకువగా ఉండటం గ‌మ‌నించిన దొంగ ప‌రుగందుకున్నాడు. ఈ క్ర‌మంలో ప్ర‌మాదావ‌శాత్తు బావిలో ప‌డి మ‌ర‌ణించాడు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ చౌరస్తాలో ఉన్న ఒక ఇంట్లో గురువారం రాత్రి దొంగలు పడి అందిన కాడికి ఎత్తుకెళ్లారు. అది గమనించిన స్థానికులు అందులో ఒక దొంగను పట్టుకొని విచారించగా దొంగతనానికి వచ్చానని […]

  • By: krs    latest    Aug 05, 2023 6:40 AM IST
Manchiryala | దొంగతనానికి వెళ్లి.. బావిలో పడి దొంగ మృతి

Manchiryala

విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లోకి దొంగ చోరీ చేయ‌డానికి వెళ్లాడు. అయితే ఆ ఇంటి వారు మెలకువగా ఉండటం గ‌మ‌నించిన దొంగ ప‌రుగందుకున్నాడు. ఈ క్ర‌మంలో ప్ర‌మాదావ‌శాత్తు బావిలో ప‌డి మ‌ర‌ణించాడు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ చౌరస్తాలో ఉన్న ఒక ఇంట్లో గురువారం రాత్రి దొంగలు పడి అందిన కాడికి ఎత్తుకెళ్లారు.

అది గమనించిన స్థానికులు అందులో ఒక దొంగను పట్టుకొని విచారించగా దొంగతనానికి వచ్చానని చెప్పాడు. ఆ దొంగ‌ మ‌ద్యం మత్తులో ఉండ‌టంతో స్థానికులు అత‌డిని వదిలి పెట్టారు. అయితే శుక్ర‌వారం సాయంత్రం ఆ ఇంటి యజమానికి బావిలో ఒక మృతదేహం కనిపించింది. దీంతో వెంట‌నే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిసి కెమెరాలు ఆధారంగా దొంగతనానికి వచ్చి భావిలో పడినట్లు భావిస్తున్నారు. య‌జ‌మాని ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.