మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి.. ఎప్పుడంటే?

విధాత: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు మంచు మనోజ్. గత కొన్నాళ్లుగా ఆయనపై ఎటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి మంచు మనోజ్ రెండో పెళ్లిపై నెట్టింట్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలన్నింటికీ తెర‌ దించుతూ మంచు మనోజ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకోబోతున్నట్టు ఇప్పటికే మనోజ్ పలు హింట్స్ ఇచ్చాడు. […]

  • By: krs    latest    Feb 27, 2023 2:05 PM IST
మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి.. ఎప్పుడంటే?

విధాత: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు మంచు మనోజ్. గత కొన్నాళ్లుగా ఆయనపై ఎటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి మంచు మనోజ్ రెండో పెళ్లిపై నెట్టింట్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలన్నింటికీ తెర‌ దించుతూ మంచు మనోజ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకోబోతున్నట్టు ఇప్పటికే మనోజ్ పలు హింట్స్ ఇచ్చాడు. గత మూడేళ్ల నుంచి సింగిల్ స్టేటస్ మెయింటైన్ చేస్తున్న మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నా.. ఇరు ఫ్యామిలీలు మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎక్కడా ప్రస్తావించలేదు.

కానీ ఇప్పుడు రాజకీయ బంధంతో చిత్ర సంబంధం ముడిపడినట్లుగా తెలుస్తుంది. మంచు మనోజ్‌తో కలిసి భూమా మౌనిక రెడ్డి ఏడడుగులు వేసేందుకు సిద్ధమైనట్లుగా టాక్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో బాగా పేరొందిన రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్.. అధికారికంగా వివాహం చేసుకునేందుకు లగ్గం కూడా పెట్టేశారని.. వీరి వివాహం మార్చి 3వ తేదీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించి ఒక వేడుక మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లో జరిగినట్టు సమాచారం. ఇప్పుడు పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని.. చాలా సింపుల్‌గా ఈ పెళ్లి తతంగం ముగించ బోతున్నారనేది తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

ఇక మంచు మనోజ్, భూమా మౌనికల విషయానికి వస్తే.. మంచు మనోజ్ కొంతకాలం క్రితం ప్రణతి అనే అమ్మాయిని విహహం చేసుకున్నాడు. కానీ ఆ వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. మనోజ్ తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఒంటరిగా ఉంటున్నాడు. అదేవిధంగా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహమే కావడం విశేషం. గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారనేలా కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.