Manipur | సిట్ విచారణ కుదరదు.. మణిపూర్ హింసపై దాఖలైన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
Manipur | న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై సిట్ విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. మయంగ్లంబా బాబీ అనే మైతేయీ మహిళ.. సీనియర్ న్యాయయవాది మాధవీ దివాన్ ద్వారా సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. కుకీ ఆదివాసీలలో గంజాయి సాగు విపరీతంగా జరుగుతున్నదని, మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచి సరిహద్దు దాటి ఉగ్రవాదులు మణిపూర్‌లోకి ప్రవేశిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. గంజాయి కోసం పోటీలో ఈ ఉగ్ర ముఠాలు, కుకీల మధ్య హింసాత్మక ఘటనలే ప్రస్తుత […]

Manipur |
న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై సిట్ విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. మయంగ్లంబా బాబీ అనే మైతేయీ మహిళ.. సీనియర్ న్యాయయవాది మాధవీ దివాన్ ద్వారా సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
కుకీ ఆదివాసీలలో గంజాయి సాగు విపరీతంగా జరుగుతున్నదని, మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచి సరిహద్దు దాటి ఉగ్రవాదులు మణిపూర్‌లోకి ప్రవేశిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.
గంజాయి కోసం పోటీలో ఈ ఉగ్ర ముఠాలు, కుకీల మధ్య హింసాత్మక ఘటనలే ప్రస్తుత మణిపూర్ హింసకు కారణం అని పేర్కొన్నారు. కనుక ఈ విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని ఆమె తన లాయర్ ద్వారా కోరారు.
దీనిని విచారించిన సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, మనోజ్ మిశ్రాల ధర్మాసనం.. ఈ వాదన సమగ్రంగా లేదంటూ కొట్టివేసింది. హింసకు కారణంగా ఒక సమూహాన్ని నిందించటం సరైందికాదని అన్నది.