బ్యాంక్ దోపిడీ.. మ‌ణిపూర్‌లో 18 కోట్లు లూటీ

మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులో భారీ దోపిడీ జ‌రిగింది. అత్యాధునిక ఆయుధాల‌తో ముసుగు ధరించిన వ‌చ్చిన దొంగలు రూ.18 కోట్లకు పైగా దోచుకెళ్లారు

బ్యాంక్ దోపిడీ.. మ‌ణిపూర్‌లో 18 కోట్లు లూటీ
  • మ‌ణిపూర్ సాయుధ‌ ముసుగు దొంగ‌ల భారీ దోపిడీ


విధాత‌: మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులో భారీ దోపిడీ జ‌రిగింది. అత్యాధునిక ఆయుధాల‌తో ముసుగు ధరించిన వ‌చ్చిన దొంగలు రూ.18 కోట్లకు పైగా దోచుకెళ్లారు. ఈ విష‌యాన్ని అధికారులు శుక్ర‌వారం మీడియాకు వెల్ల‌డించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు, ఏటీఎం కోసం ఉద్దేశించిన నగదును ఉఖ్రుల్ జిల్లాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖ‌లో నిల్వ చేస్తారు.


రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉఖ్రుల్ పట్టణంలోని ఆ బ్యాంకు వద్దకు అధునాతన ఆయుధాలతో వచ్చిన దొంగలు గురువారం సాయంత్రం సిబ్బందిని బెదిరించారు. భద్రతా సిబ్బందిని బంధించి ఖజానాలో నిల్వ ఉన్న మొత్తం న‌గ‌దును దోచుకెళ్లారు.


భ‌ద్ర‌తా ద‌ళ యూనిఫాంలో ఉన్నకొంద‌రు దుండగులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బందిని బ్యాంకు వాష్‌రూమ్‌లోకి బంధించి తాళం వేశార‌ని అధికారులు తెలిపారు. అధికారులు ఘ‌ట‌న‌పై ఉఖ్రుల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.