Bank | బ్యాంకుల్లో క్లైయిమ్ చేయని నగదును ఎలా తీసుకోవాలి?
ఏదైనా బ్యాంకు ఖాతాల్లో ఎంతో కొంత డిపాజిట్ చేసి మర్చిపోయి వదిలేశారనుకోండి... ఇప్పుడు ఆ డబ్బును మీరు తిరిగి తీసుకోవచ్చు. ఏళ్ల తరబడి బ్యాంకు ఖాతాల్లో డ్రా చేయకుండా లేదా క్లైయిమ్ చేయకుండా ఉన్న డబ్బులను తీసుకొనే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఈ డబ్బును తీసుకోవాలని కోరుతూ ప్రచారం కూడా కల్పించింది. ఈ డబ్బును ఎలా తీసుకోవాలో చూద్దాం.
ఏదైనా బ్యాంకు ఖాతాల్లో ఎంతో కొంత డిపాజిట్ చేసి మర్చిపోయి వదిలేశారనుకోండి… ఇప్పుడు ఆ డబ్బును మీరు తిరిగి తీసుకోవచ్చు. ఏళ్ల తరబడి బ్యాంకు ఖాతాల్లో డ్రా చేయకుండా లేదా క్లైయిమ్ చేయకుండా ఉన్న డబ్బులను తీసుకొనే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఈ డబ్బును తీసుకోవాలని కోరుతూ ప్రచారం కూడా కల్పించింది. ఈ డబ్బును ఎలా తీసుకోవాలో చూద్దాం.
క్లైయిమ్ చేయని డబ్బులు అంటే ఏంటి?
మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఏదేని బ్యాంకు ఖాతాల్లో కొంత నగదును డిపాజిట్ చేసి, దాన్ని ఇంతవరకు తీసుకోకపోవడాన్ని క్లైయిమ్ చేయని నగదుగా పిలుస్తారు. అంటే ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ ఖాతా లేదా కరెంట్ ఖాతాల్లో పదేళ్లుగా క్లైయిమ్ చేయని డిపాజిట్లు ఉంటే వాటిని అన్ క్లైయిమ్డ్ ఖాతాలుగా గుర్తిస్తారు. అదే విధంగా టర్మ్ డిపాజిట్లు కూడా మెచ్యూరిటీ దాటిన తర్వాత పదేళ్ల వరకు క్లైయిమ్ చేయకపోతే వీటిని కూడా క్లైయిమ్ చేయని నగదు కింద గుర్తిస్తారు. రకరకాల కారణాలతో బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన నగదు పెద్ద మొత్తంలో నిల్వ ఉంది. దేశ వ్యాప్తంగా పలు బ్యాంకుల్లో ఇలా అన్ క్లైయిమ్డ్ మనీ రూ. 1.84 లక్షల కోట్లుంది. ఈ డబ్బును ఆయా ఖాతాదారులు లేదా వారి కుటుంబ సభ్యులు క్లైయిమ్ చేసుకోవచ్చు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం మీ డబ్బు, మీ హక్కు అంంటూ ప్రచారం కూడా ప్రారంభించింది. ఈ నగదును తీసుకొనేందుకు వీలుగా ప్రత్యేకంగా ఉద్దాం (యూడీజీఏఎం)వెబ్ పోర్టల్ ను కూడా ప్రారంభించింది.
బ్యాంకుల్లో డబ్బులు క్లైయిమ్ చేయకుండా ఎందుకు ఉంటుంది?
ఎవరైనా బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత ఈ నగదు గురించి మర్చిపోవడం. లేదా బ్యాంకు ఖాతా ప్రారంభించిన వ్యక్తి మరణించిన సమయంలో ఈ డబ్బుల గురించి నామినీకి తెలియకపోవడం. ఒకవేళ ఈ విషయం తెలిసినా డబ్బులను బ్యాంకు నుండి డ్రా చేసుకొనే విషయంలో అవగాహన లేకోవడం, బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసిన వ్యక్తికి వారసులు లేకపోతే బ్యాంకుల్లో అన్ క్లైయిమ్డ్ నగదు మిగిలిపోతోంది. ఇలా ఎవరూ క్లైయిమ్ చేయని నగదును బ్యాంకులు ఆర్ బీ ఐ లోని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ డీఈఏ ఫండ్ కు బదిలీ చేస్తాయి.
ఉద్గాం పోర్టల్ లో ఏం చేయాలి?
క్లైయిమ్ చేయని డబ్బుల కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్గాం పోర్టల్ ను ప్రారంభించింది. మీ మొబైల్ నెంబర్ తో ఈ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు క్లైయిమ్ చేయని నగదు ఎవరి పేరున ఉందో ఆ ఖాతాదారుడి పేరు, అతడి వివరాలు పుట్టిన తేదీ, పాన్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టులలో ఏదో ఒక గుర్తింపును పోర్టల్ లో సబ్ మిట్ చేయాలి. మీరు నమోదు చేసిన వివరాలు బ్యాంకు ఖాతాదారుడి వివరాలతో సరిపోలితే మీ బ్యాంకు ఖాతా వివరాలు పోర్టల్ లో తెలుస్తాయి. వెంటనే ఈ వివరాల ఆధారంగా సంబంధిత బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లి అన్ క్లైయిమ్ నగదు ఫారం నింపి బ్యాంకులో ఇవ్వాలి. మీరు అందించిన వివరాలను బ్యాంకు అధికారులు పరిశీలించి మీ డబ్బులను మీకు అందిస్తారు. అయితే ఈ ప్రాసెస్ పూర్తికావడానికి సమయం పడుతుంది. ఉద్గాం పోర్టల్ లో 2025 అక్టోబర్ నాటికి 30 బ్యాంకులున్నాయియ. ఈ 30 బ్యాంకుల్లోనే 90 శాతం వరకు అన్ క్లైయిమ్డ్ డిపాజిట్లున్నాయి.
ఆ బ్యాంకు ఖాతాను పునరుద్దరించుకోవచ్చా?
క్లైయిమ్ చేయని నగదు ఉన్న బ్యాంకు ఖాతాను తిరిగి పునరుద్దరించుకోవచ్చు. అయితే ఇందుకు బ్యాంకులో కొన్ని పద్దతులుంటాయి. పునరుద్దరణకు అవసరమైన డాక్యుమెంట్లను బ్యాంకు అధికారులు అడుగుతారు. అంటే ఆధార్, పాన్ కార్డు వంటి డాక్యుమెంట్లను బ్యాంకులో అందించి ఆ బ్యాంకు ఖాతా మీదేనని రుజువు చేసుకోవాలి. అయితే ఇంతకాలం పాటు బ్యాంకు ఖాతాను ఆపరేట్ చేయని కారణంగా ఆ ఖాతాలో డబ్బులుండవు. బ్యాంకు నిబంధనల మేరకు ఆయా బ్యాంకుల కనీస మొత్తం చెల్లించి బ్యాంకు ఖాతాను యాక్టివేట్ చేసుకోవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram