Outsourcing Employees | జీతం 21,500.. చేతికి అందేది 13,500 మాత్రమే.. ఇదీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల దుస్థితి
తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరోసారి చర్చల్లోకి వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో భారీ కోతలు, ఆలస్యాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ₹21,500 జీతంలో ₹13,500 మాత్రమే ఉద్యోగులకు అందుతున్నదని తెలిపారు. దళారీ వ్యవస్థను రద్దు చేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
- ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి: ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్
విధాత, హైదరాబాద్:
Outsourcing Employees | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఇతర రాష్ట్రాల మాదిరి తెలంగాణలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దళారీ వ్యవస్థను రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. మార్చి నెల 31వ తేదీ లోపు కాంట్రాక్టు ఏజెన్సీ వ్యవస్థను రద్ధు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను చిన్నమైల్ అంజిరెడ్డి శాసన మండలిలో ప్రస్తావించారు. ఆ తరువాత మీడియా పాయింట్ లో మాట్లాడుతూ, రాష్ట్రంలో 4 లక్షల 91 వేల మంది పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఆధార్ సేకరించి లింక్ చేశారని, నకిలీలపై ఇంత వరకు చర్యలు తీసుకున్నారన్నారు.
అత్యధికంగా ఒక్కొక్కరికి 21వేల 500 జీతం ఇస్తున్నారని, కాని వీరికి 13వేల 500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. మిగతా సొమ్మును ఏజెన్సీలు దిగమింగుతున్నాయన్నారు. ఆఫీసు బాయ్, డ్రైవర్, డీటీపీ, అసిస్టెంట్లు గా పనిచేస్తున్నారన్నారు. 104 సర్వీసులో 8 నెలలు, సీతారామ ప్రాజెక్టు 11 నెలలు, జీహెచ్ఎంసీలో 3 నెలలు, సంక్షేమ శాఖలో నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేకపోవడం, తక్కువ వేతనాలు చెల్లింపు, సకాలంలో జీతాలు అందడం లేదన్నారు.
ఉత్తరప్రదేశ్, కర్నాటక, ఏపీ రాష్ట్రాలలో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను రద్ధు చేశారన్నారు. బోగస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను గుర్తించినప్పటికీ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు. హిల్ట్ పాలసీ విషయంలో ప్రభుత్వం సరైన విధానంతో ముందుకు పోవడం లేదని, కేవలం రియల్ దందా కోసమే ఈ విధానం తెచ్చారని అంజిరెడ్డి అన్నారు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రైతులకు రైతు భరోసా లేకుండా పోయిందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణ మాఫీ కాలేదన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన రాష్ట్రంలో వర్తింపచేయకపోవడంతో ప్రమాదం జరిగినపుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే తెలంగాణ లో ఫసల్ బీమా యోజన ను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేజి నెంబర్ 24 లో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి స్థలం తో పాటు రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లను రేషన్ కార్డుతో ముడిపెట్టిందని ధ్వజమెత్తారు. జనవరి 2025 లో 40 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చిందో సమాధానం చెప్పాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అవాస్ యోజన కింద ఇల్లు కట్టుకుంటే గ్రామాల్లో రూ.75 వేలు పట్టణంలో అయితే రూ.1.50 లక్షలు ఇస్తుందన్నారు. ఈ పథకం విడుదల అయిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కలిపేసిందన్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణలో ప్రధానమంత్రి అవాస్ యోజన కింద 3,86,662 ఇండ్లకు గాను రూ.6,426 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మరో 18వే ఇండ్లకు రూ.260 కోట్లను మంజూరు చేసిందన్నారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చడంలో ఉన్న శ్రద్ధ కట్టించడంలో ఎందుకు లేదో చెప్పాలని అంజిరెడ్డి డిమాండ్ చేశారు.
Read Also |
Mallikarjun Kharge | మమ్మల్ని ప్రేమించి.. మోదీని పెళ్లాడారు.. : దేవెగౌడపై ఖర్గే సెటైర్
US Self Deportation Offer : అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్ !
Telangana SC Corporation | నిరుద్యోగ ఎస్సీ యువతకు సువర్ణావకాశం.. సబ్సిడీపై ఈవీ వాహనాలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram