Contract Employees | ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అదనంగా పదివేల జీతం

ఏపీలోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇకపై వంద శాతం గ్రాస్‌ శాలరీని కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ అందుకోబోతున్నారు.

Contract Employees | ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అదనంగా పదివేల జీతం

Contract Employees |  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులకు వంద శాతం గ్రాస్ శాలరీ చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రతీ ఉద్యోగికి సగటున నెలకు సుమారు రూ.10 వేలు అదనంగా వేతనం అందనుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాల్లో పారదర్శకత, సరైన వేతనాలు,సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం APCOS(ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్‌సోర్స్‌డ్ సర్వీసెస్) ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా ఏజెన్సీల ప్రమేయం లేకుండా నేరుగా ఉద్యోగులకు వేతనాలు అందుతాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తారు.

ఏప్రిల్ నుంచి తెలంగాణలో నేరుగా జీతాల చెల్లింపు

తెలంగాణ ప్రభుత్వం సైతం 5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి వారి జీతాలను మధ్యవర్తులు, ఏజెన్సీల ప్రమేయం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు వాడుతున్న ఐఎఫ్ఎంఎస్ (IFMS) విధానం లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారా ఈ చెల్లింపులు జరగనున్నాయి. దీనివల్ల ఏజెన్సీలు చేసే జీతాల కోతలకు, పీఎఫ్, ఈఎస్ఐ నిధుల మళ్లింపునకు అడ్డుకట్ట పడనుంది. ఆధార్ అనుసంధానం ద్వారా బినామీలను ఏరివేసి, పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో పాటు సామాజిక భద్రతపై భరోసా లభించనుంది. అలాగే 30శాతం వేతనాలు పెంచడంపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది.