ఔట్ సోర్సింగ్..కాంట్రాక్టు ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు!

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యూలర్ జారీ చేసింది.

ఔట్ సోర్సింగ్..కాంట్రాక్టు ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు!

విధాత, హైదరాబాద్ : కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యూలర్ జారీ చేసింది. ఏజెన్సీల ప్రమేయం లేకుండా మే నెల నుంచి వారికి ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు చెల్లించాలని ఉత్వర్వుల్లో స్పష్టం చేసింది. ఏప్రిల్ నెల జీతాన్ని మే 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని పేర్కొంది.

ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాలతో.. ఇంతకాలం జీతాలు ఎప్పుడేస్తారో..ఎన్ని రోజులకు..ఎన్ని నెలలకు వేస్తారో తెలియక కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పడినట్లయ్యింది. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు వస్తాయన్న సమాచారంతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం సేకరించిన గణంకాల మేరకు 4.80లక్షల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని తేలింది. వాస్తవానికి ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వ విభాగాలు ప్రతినెలా జీతభత్యాలు మంజూరు చేస్తున్నప్పటికి.. సంబంధిత సంస్థల ఖాతాల్లో జమ చేయడం లేదని ఇటీవల ప్రభుత్వ విచారణలో తేలింది.ఉద్యోగి వాటాతోపాటు ప్రభుత్వం ఇచ్చే వాటా మొత్తాలను ఏజెన్సీలు పది సంవత్సరాలుగా స్వాహా చేస్తున్నాయని గుర్తించించారు. ఈ మొత్తాన్ని వెంటనే ఈపీఎఫ్, ఈఎస్ఐ ఖాతాల్లో జమ చేసి, ఆ వివరాలను సమర్పించాలని ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశారు. జమ చేయని పక్షంలో ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే తెలంగాణ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం తాజాగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ఆదేశించడం విశేషం. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు 25వ తేదీలోపు ఉద్యోగుల అటెండెన్స్ వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఏజెన్సీలు తమ వాటా కింద పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపులపై ప్రభుత్వ పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది.