విధాత: మనలో చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంది. సినిమా వారు సినిమా వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదని భావిస్తారు కానీ.. రాజశేఖర్ జీవిత నుంచి మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ వరకు దీన్ని తప్పని రుజువు చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రిందట బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఫ్లాప్ మూవీ ‘వంశీ’. ఇందులో మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. హీరోయిన్గా నమ్రత […]
విధాత: మనలో చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంది. సినిమా వారు సినిమా వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదని భావిస్తారు కానీ.. రాజశేఖర్ జీవిత నుంచి మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ వరకు దీన్ని తప్పని రుజువు చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రిందట బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఫ్లాప్ మూవీ ‘వంశీ’. ఇందులో మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. హీరోయిన్గా నమ్రత శిరోద్కర్ టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించింది.
ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఈ మాజీ మిస్ ఇండియా సూపర్ స్టార్ మహేష్‌లు ప్రేమలో పడి తర్వాత వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఈమె గృహిని పాత్రకే పరిమితమైంది. వివాహం తర్వాత సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా.. ఆమెకు నటించే ఆలోచన లేదు.
తాజాగా ఈమె ఓ మీడియాతో మాట్లాడుతూ.. మహేష్ బాబు నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజుని నా జీవితంలో మర్చిపోలేను. నా లైఫ్ లోనే అది అత్యంత తీపికరమైన రోజు. పెళ్లి తర్వాత నా ప్రపంచమే మారిపోయింది. మాతృత్వం పొందడం గొప్ప అనుభూతి. సినిమాలలోకి ప్రవేశించడానికి ముందు నేను మోడల్‌ను.. మహేష్ నేను వివాహం చేసుకున్న తర్వాత శ్రీమతిగా మారిపోయాను.
మహేష్ బాబుకు తనకు కాబోయే శ్రీమతి ఎలా ఉండాలో స్పష్టమైన ఆలోచన ఉంది. అందుకే నేను సినిమాలకు దూరమయ్యాను. మహేష్‌కు నాకు మధ్య గొడవలు పెద్దగా రావు.. వచ్చినా అవి పిల్లల విషయంలోనే. ఆయన పిల్లలు ఏం కావాలన్నా కొనిస్తారు.. దాంతో పిల్లలు తమకు ఏం కావాలన్నా ఆయనని అడుగుతారు.. ఆయన కాదు అని చెప్పరు కానీ నేను నో అంటాను. ఆ విషయంలో మాత్రం మా మధ్య కాస్త గొడవలు జరుగుతుంటాయి.
ఇక మహేష్ నటించిన సినిమాలలో నాకు పోకిరి అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో మహేష్ చెప్పే పంచ్ డైలాగ్స్ అన్నీ చాలా ఇష్టపడతానని నమ్రత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నమ్రత గౌతమ్, సితారలకు జన్మనిచ్చిన తర్వాత వారి ఆలనా పాలన దగ్గరుండి చూసుకుంటుంది. ఇద్దరూ కొంచెం పెద్దయ్యాక మహేష్ కెరీర్ బాధ్యతలు, వ్యాపారాలు, నిర్మాతగానూ వ్యవహరించడమే కాకుండా.. మహేష్ పర్సనల్ మేనేజర్‌గా మారిపోయింది.