Nara Rohith Wedding : హైదరాబాద్ లో ఈనెల 30న నారా రోహిత్ వివాహం
టాలీవుడ్ హీరో నారా రోహిత్ వివాహం ఈ నెల 30న శిరీషతో జరగనుంది. అక్టోబర్ 27 నుంచి 29 వరకు పెళ్లి వేడుకలు కొనసాగుతాయి. 'ప్రతినిధి 2' సినిమా సమయంలో ప్రేమలో పడిన వీరి వివాహ నిశ్చితార్థం గతంలో జరిగింది.

విధాత, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో నారా రోహిత్ వివాహం ఈ నెల 30న జరుగనుంది. శిరీషతో నారా రోహిత్ వివాహ వేడుకలో భాగంగా 27 నుంచి 29 వరకు హల్దీ, పెళ్లి కొడుకు వేడుక, మెహందీ, ముహూర్తం వంటి తతంగాలు కొనసాగనున్నాయి. తాజాగా జరిగిన పసుపు దంచే కార్యక్రమంతో పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను శిరీష సోషల్ మీడియాలో షేర్ చేయగా..అవి వైరల్ గా మారాయి. రోహిత్ తను ప్రేమించిన శిరీషతో గతేడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అయితే గతేడాది తన తండ్రి మరణంతో రోహిత్ పెళ్లి వేడుక వాయిదా పడింది. రోహిత్, శిరీష ‘ప్రతినిధి 2’ సినిమాలో నటించారు. అప్పటి నుండే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పి అంగీకారం పొందారు. పెద్దలు కూడా ఓకే చెప్పడంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.
ఈ నెల 13న హైదరాబాద్‌లో శిరీష లేళ్ళతో వివాహ నిశ్చితార్దం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. నారా రోహిత్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామూర్తి నాయుడి కుమారుడు. నారావారి కుటుంబం రాజకీయాలలో ఉన్నప్పటికీ నారా రోహిత్ సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. . బాణం సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ ఇటీవల సుందరకాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఫర్వాలేదనిపించారు.