Changes In AP Inter Exams : ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు

ఏపీ ఇంటర్ పరీక్షల్లో 2025-26 విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పులు చేశారు. మ్యాథ్స్ 1A, 1B కలిపి ఒకే పేపర్‌గా (100 మార్కులు) మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. బైపీసీలోనూ మార్పులు చేశారు. ప్రాక్టికల్స్, థియరీ కలిపి పాస్ మార్కులను 59కి తగ్గించారు. ఫెయిల్ అయిన పాత విద్యార్థులకు ఈ మార్పులు వర్తించవు.

Changes In AP Inter Exams : ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో విద్యార్థులకు సానుకూలంగా ఉండేలా మార్పులు చేసింది. ఎన్ సీ ఈఆర్ టీ విధానం ప్రకారం ఈ మార్పులు తీసుకొచ్చినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. నూతన మార్పులలో భాగంగా గణితంలో 1ఏ, 1బీలను ఒకే సబ్జెక్ట్గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఒక్కో పేపర్కు 75 మార్కులు ఉండగా.. పాస్ మార్కులు 26గా ఉండేది. ఇప్పుడు గణితం పరీక్షకు ఒక్కటే పేపర్ తో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పాస్ మార్కులు 35గా నిర్ణయించారు.

బైపీసీలో బోటనీ, జువాలజీ కలిపి బయాలజీ సబ్జెక్టుగా మార్పు చేశారు. 85మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఫస్టియర్ లో పాస్ మార్కులు 29గా ఖరారు చేశారు. సెకండియర్ లో 30 మార్కులు వస్తే పాస్ చేస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ ఉంటాయి. గతంలో ఫెయిలై పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్పులు వర్తించవని ఇంటర్ బోర్డు వెల్లడించింది.

ప్రస్తుతం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జక్ట్స్ లో రెండు సంవత్సరాలకు కలిపి 59.50 మార్కులు రావాల్సి ఉండగా.. కొత్త రూల్స్ ప్రకారం 59 మార్కులకు తగ్గించింది ప్రభుత్వం. దీన్ని బట్టి.. హాఫ్ మార్కు తక్కువ వచ్చినా పాస్ అయినట్లే పరిగణిస్తారు. ఈ క్రమంలో ప్రాక్టికల్స్ లో పాస్ మార్కులు 10.5 నుంచి 11 మార్కులకు పెరిగాయి. కొత్త రూల్స్ వల్ల ఇకమీదట అర మార్కు తక్కువ వచ్చినా ఫెయిల్ అవుతామేమో అన్న టెన్షన్ నుంచి స్టూడెంట్స్ కి రిలీఫ్ లభించినట్లయ్యింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు మొదలవనున్నాయి. మరోవైపు ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు అక్టోబర్‌ 22వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత రూ.1,000 ఆలస్య రుసుముతో అక్టోబర్‌ 30 వరకు ఫీజు చెల్లింపుకు అవకాశం కల్పిస్తున్టన్లు ఇంటర్మీడియట్‌ బోర్డు ఇటీవల తెలపింది. థియరీ పేపర్లకు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275, బ్రిడ్జికోర్సు సబ్జెక్టుకు రూ.165 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

AP Inter Syllabus