Medak | మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్

Medak రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని పలువురికి గాయాలు అదే సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంత్రి కేటీఆర్…. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించిన కేటీఆర్ విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా చేగుంట సమీపంలో జాతీయ రహదారిపై ఆర్ టి సి బస్, కారు ఢీకొన్న సంఘటనలో గాయపడిన పలువురిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తన కాన్వాయ్ లోని వాహనంలో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి మానవత్వం […]

Medak | మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్

Medak

  • రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని పలువురికి గాయాలు
  • అదే సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంత్రి కేటీఆర్….
  • గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించిన కేటీఆర్

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా చేగుంట సమీపంలో జాతీయ రహదారిపై ఆర్ టి సి బస్, కారు ఢీకొన్న సంఘటనలో గాయపడిన పలువురిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తన కాన్వాయ్ లోని వాహనంలో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.

మంత్రి కెటిఆర్ నిజామాబాద్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్నారు. సరిగ్గా అప్పుడే చెగుంట సమీపంలోని రెడ్డి పల్లి వద్ద జాతీయ రహదారిపై కారు ఆర్ టి సి బస్ కారు ఢీకొన్నాయి.

కారులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. కెటిఆర్ తన కాన్వాయ్ నీ ఆపి దిగి తన కాన్వాయ్ లో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీస్ లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.