Medak | గజ్వేల్‌లో మారింది రోడ్లు మాత్రమే.. ప్రజల బ్రతుకులు కాదు: హనుమంత రావు

Medak వచ్చే ఎన్నికల్లో నర్సారెడ్డిని గెలిపించాలని పిలుపు విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా గజ్వేల్ లో మారింది రోడ్లు మాత్రమేనని ప్రజల బతుకు ల్లో ఎలాంటి మార్పు రాలేదని ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేనందుకే సీఎం కేసీఆర్ గజ్వేల్ నుండి వెళ్లిపోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం రామచంద్రపురంలో కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఇంటిటి ప్రచారం నిర్వహించారు. అనంతరం గజ్వేల్లో […]

Medak | గజ్వేల్‌లో మారింది రోడ్లు మాత్రమే.. ప్రజల బ్రతుకులు కాదు: హనుమంత రావు

Medak

  • వచ్చే ఎన్నికల్లో నర్సారెడ్డిని గెలిపించాలని పిలుపు

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా గజ్వేల్ లో మారింది రోడ్లు మాత్రమేనని ప్రజల బతుకు ల్లో ఎలాంటి మార్పు రాలేదని ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేనందుకే సీఎం కేసీఆర్ గజ్వేల్ నుండి వెళ్లిపోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం రామచంద్రపురంలో కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఇంటిటి ప్రచారం నిర్వహించారు.

అనంతరం గజ్వేల్లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. దళిత బంధులో 30 శాతం,డబుల్ బెడ్రూం ఇళ్లలో 20 శాతం బీఆరెస్‌ నేతలు కమిషన్ లు తీసుకుంటున్నారని ఆరోపించారు. దేశంలోనే నెంబర్ వన్ అవినీతి సీఎం కేసీఆర్ అని ఎద్దేవాచేశారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మీ పరిస్థితి ఎలావుండేదో ఒక సారి ఆలోచించుకోవాలన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో పేదలు, రైతులకు దగ్గర అయ్యాడన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, మహిళా గర్జన కార్యక్రమాలను చేపట్టబోతున్నామన్నారు. ధరణి పేరుతో పేదల భూములన్నీ కేసీఆర్ లాక్కున్నాడని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణినిని ఎత్తివేస్తామన్నారు.

బీసీలకు న్యాయం చేయని బీజేపీ, తెలంగాణలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామంటూ చెప్పడం హాస్యాస్పదమన్నారు. బీసీల ఓట్లను దండుకోవడానికి మాత్రమే బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. గజ్వేల్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు.

ప్రజల్లో మార్పు వచ్చిందని కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో ముంచడం కాదని, త్వరలోనే బీఆరెస్‌ను ముంచేందుకు సిద్ధంగా ఉన్నాారన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు, నక్క రాములు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.