August | ఆగస్ట్ నెలలో మెగా జాతర.. ఒకే సారి ఇంత మంది హీరోలు వచ్చేస్తున్నారేంటి..!
August: టాలీవుడ్ సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు వేరు. ఆ హీరోల సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయంటే ప్రేక్షకులు క్యూ కట్టేస్తుంటారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. అయితే ఆగస్ట్ నెల మొత్తాన్ని మెగా హీరోలు గుత్తాకి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నెలలో ఏకంగా నలుగురు మెగా హీరోలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్నారు. ఒకే నెలలో ఒకరి తర్వాత మరొకరు తమ సినిమాలు దించటం చూసి ట్రేడ్ వర్గాలు […]

August: టాలీవుడ్ సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు వేరు. ఆ హీరోల సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయంటే ప్రేక్షకులు క్యూ కట్టేస్తుంటారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. అయితే ఆగస్ట్ నెల మొత్తాన్ని మెగా హీరోలు గుత్తాకి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నెలలో ఏకంగా నలుగురు మెగా హీరోలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్నారు. ఒకే నెలలో ఒకరి తర్వాత మరొకరు తమ సినిమాలు దించటం చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముందుగా పవన్ కళ్యాణ్, సాయి తేజ్ నటించిన బ్రో నుండి మెగా పండుగ మొదలు కానుంది. జులై 28న రిలీజ్ కానున్న ఈ చిత్రం ఆగస్ట్ మొదటి వారం లో కూడా థియేటర్స్ లో ఖచ్చితంగా తన ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇద్దరు మెగా హీరోలు ఈ సినిమాలో నటిస్తుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆగస్ట్ 11న భోళా శంకర్ చిత్రంతో పలకరించబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం మూవీకి రీమేక్‍గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు సమాచారం. ఇందులో చిరంజీవి గ్యాంగ్‍స్టర్ నుంచి ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన పాత్రలో కనిపించి సందడి చేయనున్నాడు. ఈ మూవీపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక మరో మెగా హీరో వరుణ్ తేజ్ ఆగస్టు 25న ‘గాంఢీవ ధారి అర్జున చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్ లో 12వ చిత్రంగా రూపొందింది. ఈ మూవీపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇక ఉప్పెన సినిమాతో మంచి హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఆ రేంజ్ హిట్ మళ్ళీ అందుకోలేదు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘కొండపొలం’ చిత్రానికి ప్రశంసలు లభించినా.. కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టలేక పోయింది. చివరిగా నటించిన ‘రంగరంగ వైభవంగా’ చిత్రం కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఆదికేశవ సినిమాపై మాత్రం భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఇందులో యంగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటించింది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ లో యాక్షన్ మూడ్‌లో దుమ్ములేపాడు వైష్ణవ్. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 18 న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఆగస్ట్ నెల మెగా హీరోల నెలగా మారనుందని చెప్పాలి