ఎవరికి కమిట్మెంట్ ఇచ్చారని శ్రీలీలని అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన క్యూట్ భామ

ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక్క హీరోయిన్ పేరు తెగ మారుమ్రోగిపోతుంది. ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా టాలీవుడ్‌లో ఈ అమ్మడి హవానే సాగనుంది. దాదాపు డజను ప్రాజెక్టులని తన ఖాతాలో వేసుకొని క్షణం తీరిక లేకుండా ఉన్న ఆ అందాల భామ మరెవరో కాదు శ్రీలీల. చూడ చక్కని అందం,ఆకట్టుకునే అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దాదాపు డజను ప్రాజెక్ట్ లు ఖాతాలో వేసుకుని రచ్చ చేస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు సరికొత్త లుక్‌లో కనిపిస్తూ మైమరచిపోయేలా చేస్తుంది. రీసెంట్ గా శ్రీలీల భగవంత్ కేసరి సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా, ఇందులో బాలయ్య కూతురిగా నటించి అలరించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో శ్రీలీల కెరియర్ మరికొంచెం పైకెళ్లింది.
ఇప్పుడు ఆదికేశవ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్‌తో కలిసి నటించింది. నవంబర్ 24వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. శ్రీలీల కూడా తెగ యాక్టివ్‌గా పాల్గొంటుంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంది. మరోవైపు ఆదికేశవ్ సినిమా రిలీజ్ లో భాగంగా.. శ్రీలీల పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తుంది. రీసెంట్‌గా బిగ్ బాస్ షోలో కూడా మెరిసిన సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్‌తో కలిసి బిగ్ బాస్ షోకి వెళ్లిన శ్రీలీల అక్కడ కూడా సందడి చేసింది. ఇక తాజాగా తన ఇన్‌స్టా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఆమెకి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఒక నెటిజన్స్.. మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారా అని ప్రశ్నించగా, దానికి స్టన్నింగ్ సమాధానం ఇచ్చింది. అవును నేను కమిట్మెంట్ ఇచ్చాను. నా పనులకు కమిట్మెంట్ ఇచ్చాను అంటూ ఈ సందర్భంగా నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది. మొత్తానికి శ్రీలీల కనిపించే అంత కూల్ కాదని అర్ధమైంది. ఇక శ్రీలీల నటించిన ఆదికేశవ మంచి హిట్ అయితే మాత్రం ఈ అమ్మడి కెరీర్ జెట్ స్పీడ్‌తో మరింత దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో నితిన్, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే