Sashirekha Lyrical Song : ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్

చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా నుంచి ‘శశిరేఖ’ లిరికల్ సాంగ్ విడుదలైంది. చిట్టి స్టెప్పులతో మెగా స్టార్ ఆకట్టుకున్నారు.

Sashirekha Lyrical Song : ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్

విధాత : మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా నుంచి ‘శశిరేఖ’ లిరికల్ సాంగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. పాట ప్రారంభంలో వర ప్రసాద్ ‘శశిరేఖా ఓ మాట చెప్పాలి’ చెప్పాక ఫీలు కాక అంటే, హీరోయిన్ శశిరేఖ(నయనతార) ఓ ప్రసాదు! మోమాటాల్లేకుండా చెప్పేసెయ్ ఏమి కాదు’ అంటూ సాగిన పాట వినదగిన లిరిక్స్..సంగీతంతో ఆకట్టుకుంది. మంచి బీట్ తో సాగిన పాట సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా… భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ పాడారు.

అద్బుత మైన కలర్ ఫుల్ లోకేషన్లలో చిత్రీకరించిన పాటలో చిరంజీవి, నయన్‌లు సరికొత్తగా న్యూ లుక్‌లో అదరగొట్టారు. చిరంజీవి, నయనతార వేసిన క్లాసిక్‌ స్టెప్పులు పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫస్ట్ సాంగ్ ‘మీసాల పిల్ల’ ప్రస్తుతం ట్రెండ్ అవుతుండగా… ఇప్పుడు ‘శశిరేఖ’ పాట దానిని మించేలా కనిపిస్తుంది. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.