Pragathi Tollywood Actrer| ప్రగతి అక్కా…పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్
టాలీవుడ్ నటి ప్రగతి తెలుగు ప్రజలకు సుపరిచితమే. తెలుగు ప్రజలకు హాస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే ఎక్కువగా ప్రగతి పాపులర్ అయ్యింది. అయితే ఈ టాలీవుడ్ యాక్టర్ తనలోని మరో యాంగిల్ టాలెంట్ ను కూడా తాజాగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఏకంగా ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పలు పతకాలు సాధించి ప్రగతి అక్కా..మజాకా అంటూ అందరిని విస్మయ పరిచింది.
విధాత : టాలీవుడ్ నటి( Tollywood Actrer) ప్రగతి(Pragathi )తెలుగు ప్రజలకు సుపరిచితమే. తెలుగు ప్రజలకు హాస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే ఎక్కువగా ప్రగతి పాపులర్ అయ్యింది. అయితే ఈ టాలీవుడ్ యాక్టర్ తనలోని మరో యాంగిల్ టాలెంట్ పే కూడా తాజాగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఏకంగా ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పలు పతకాలు(medals) సాధించి ప్రగతి అక్కా..మజాకా అంటూ అందరిని విస్మయ పరిచింది. ఇందుకు సంబంధించిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోగా..ప్రగతి అక్కా..పవర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్(Turkey Powerlifting Championship)లో ఇండియా తరపున పాల్గొన్న ప్రగతి నాలుగు పతకాలు సాధించి సత్తా చాటింది. ఈ పోటీలలో ఓవరాల్‌గా సిల్వర్ మెడల్ సాధించగా, డెడ్ లిఫ్ట్‌నకు గోల్డ్ మెడల్ దక్కింది. ఇక బెంచ్, స్క్వాట్ లిఫ్టింగ్‌లో మరో రెండు సిల్వర్ మెడల్స్ సాధించినట్లు ప్రగతి ఇన్ స్ట్రా వేదికగా వెల్లడించారు. ఏపీలోని నెల్లూరు జిల్లా ఉలవపాడుకు చెందిన ప్రగతి డబ్బింగ్ ఆర్టిస్టుగా సినీ ప్రవేశం చేసి..క్రమంగా నటిగా ఎదిగారు. తర్వాత జిమ్ ట్రైనింగ్ నుంచి పవర్ లిఫ్టింగ్ పట్ల ఆకర్షితురాలైన ప్రగగత హైదరాబాద్ జిల్లా స్థాయి, తెలంగాణ, ఏపీ రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ గెల్చుకుంది. కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ గోల్డ్ మెడల్ సాధించింది. అనంతరం జాతీయ స్థాయిలో పలు పోటీల్లో రాణించిన ప్రగతి టర్కీ వేదికగా జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాణించి అదర్శప్రాయంగా నిలిచారు.
పవర్ లిఫ్టింగ్‌లో నాలుగు మెడల్స్ సాధించిన నటి ప్రగతి
టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి
గేమ్స్‌లో ఓవరాల్‌గా సిల్వర్ మెడల్, డెడ్ లిఫ్ట్‌కు గోల్డ్ మెడల్, బెంచ్ & స్క్వాట్ లిఫ్టింగ్‌లో మరో రెండు… pic.twitter.com/DwNnjB4Xe0
— PulseNewsBreaking (@pulsenewsbreak) December 7, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram