Microsoft Internet Explorer | ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు మైక్రోసాఫ్ట్ మంగళం..!
Microsoft Internet Explorer | ఇంటర్నెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ‘ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్’ శకం ముగిసింది. 1995లో ప్రారంభమై 28 ఏండ్లుగా సేవలందిస్తున్న ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలు నిలిచిపోయాయి. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ డివైజ్‌లపై ఫైనల్ అప్‌డేటెట్ వెర్షన్‌ను ‘IE11’ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. కొత్త బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అప్‌డేట్‌తో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను నిలిపివేసింది. ఈ బ్రౌజర్ ఇకపై ‘నో మోర్’ ‘రిటైర్డ్’ అని పేర్కొన్నది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు టెక్నికల్ సపోర్ట్‌ను […]
Microsoft Internet Explorer | ఇంటర్నెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ‘ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్’ శకం ముగిసింది. 1995లో ప్రారంభమై 28 ఏండ్లుగా సేవలందిస్తున్న ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలు నిలిచిపోయాయి. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ డివైజ్‌లపై ఫైనల్ అప్‌డేటెట్ వెర్షన్‌ను ‘IE11’ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. కొత్త బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అప్‌డేట్‌తో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను నిలిపివేసింది. ఈ బ్రౌజర్ ఇకపై ‘నో మోర్’ ‘రిటైర్డ్’ అని పేర్కొన్నది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు టెక్నికల్ సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో కొత్తగా తెచ్చిన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అప్‌డేట్స్ ఇస్తామని చెప్పింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అప్‌డేట్‌ను కమర్షియల్, కన్జూమర్ డివైజ్‌లన్నింటికీ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే, ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను నిలిపివేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ గతేడాది డిసెంబర్‌లో ప్రకటించిన విషయం విధితమే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram