Uppal Warangal highway traffic diversion| ఉప్పల్ – వరంగల్ హైవేపై 26వరకు ట్రాఫిక్ మళ్లింపు !

పీర్జాదిగూడ కమాన్ వద్ద పిల్లర్ ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ పని జరుగుతున్నందున ఉప్పల్ - వరంగల్ ఎన్ హెచ్ 163 జాతీయ రహదారిపై శనివారం నుంచి 26వ తేదీ వరకుట్రాఫిక్ దారి మళ్లింపు చేయాలని ఘట్కేసర్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Feb 07, 2026, 11:06 am IST
Read Time: 2 mins
Uppal Warangal highway traffic diversion| ఉప్పల్ – వరంగల్ హైవేపై 26వరకు ట్రాఫిక్ మళ్లింపు !

విధాత, హైదరాబాద్ : ఉప్పల్ – వరంగల్ ఎన్ హెచ్ 163 జాతీయ రహదారిని శనివారం నుంచి 26వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేసి ట్రాఫిక్ మళ్లింపు చేయాలని నిర్ణయించారు. పీర్జాదిగూడ కమాన్ వద్ద పిల్లర్ ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ పని జరుగుతున్నందున ట్రాఫిక్ దారి మళ్లింపు చేయాలని ఘట్కేసర్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.

వాహనాలకు డైవర్షన్ రూట్

పీర్జాదిగూడ కమాన్ వద్ద పిల్లర్ ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ పని జరుగుతున్నందు వలన ఉప్పల్ వైపు వెళ్ళే వాహన దారులు .. డెకత్లాన్ వద్ద ఎడమ వైపు కి వెళ్లి, అక్కడి నుండి సేక్రేడ్ హార్ట్ స్కూల్ ముందు నుండి పీర్జాదిగూడ మెయిన్ రోడ్ వద్ద కుడి వైపుకి తీసుకొని అక్కడినుండి ఉప్పల్ వైపు వెళ్లాలని సూచించారు. ఈ ట్రాఫిక్ డైవర్షన్ తేదీ ఉప్పల్ వైపు వెళ్ళే వాహన దారులకు మాత్రమేనని తెలిపారు. వాహన దారులు ట్రాఫిక్ మళ్లింపు అంశాన్ని గమనించి పోలీస్ వారికి సహకరించగలరని మల్కాజీగిరి కమిషనర్ ట్రాఫిక్ టూ సర్కిల్ డీసీపీ వి.శ్రీనివాస్ తెలిపారు. నేటి నుంచి 26వ తేదీ వరకు ఈ మార్గంలో వాహనాల దారి మళ్లింపు కొనసాగుతుందన్నారు.