Errabelli | వాన కొండయ్య ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి ఆటాపాట
గ్రామస్తులతో సంతోషం పంచుకున్న మంత్రి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పాలకుర్తి నియోజకవర్గంలోని కడవెండి గ్రామం (Kadavendi Village) లో మంగళవారం జరిగిన వానకొండయ్య లక్ష్మీ నరసింహ స్వామి (Lakshmi Narasimha Swamy) కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఉత్సవంలో ఉత్సవంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) పాల్గొని గ్రామస్తులతో ఆడి పాడారు. ఉత్సవంలో భాగంగా కోలాటం ఆడుతూ.. చిడతలు వాయిస్తూ.. డప్పు కొడుతూ మంత్రి ఉత్సాహం నింపారు. గ్రామస్తులు […]

- గ్రామస్తులతో సంతోషం పంచుకున్న మంత్రి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పాలకుర్తి నియోజకవర్గంలోని కడవెండి గ్రామం (Kadavendi Village) లో మంగళవారం జరిగిన వానకొండయ్య లక్ష్మీ నరసింహ స్వామి (Lakshmi Narasimha Swamy) కళ్యాణం కన్నుల పండువగా జరిగింది.
ఉత్సవంలో ఉత్సవంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) పాల్గొని గ్రామస్తులతో ఆడి పాడారు. ఉత్సవంలో భాగంగా కోలాటం ఆడుతూ.. చిడతలు వాయిస్తూ.. డప్పు కొడుతూ మంత్రి ఉత్సాహం నింపారు. గ్రామస్తులు కూడా మంత్రితో కలిసి సంతోషం పంచుకున్నారు. ఈ సందర్భంగా కడవెండిలో మగ్గం నేశారు.
కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వానకొండయ్య జాతరకు మంచి ప్రాశస్త్యం వుందన్నారు. దేవుని ఆశీస్సులతో పాలకుర్తి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది అన్నారు. కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య (Collector Sivalingaiah) పాల్గొన్నారు.