Minister Sridhar Babu | ఆటోడ్రైవ‌ర్ల‌కు ఏటా రూ.12 వేలు ఇస్తాం: మంత్రి పొన్నం

అటోడ్రైవ‌ర్ల‌సంక్షేమానికి ఏటా రూ.12 వేల ఆర్థిక స‌హాయం అంద‌జేస్తామ‌ని ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు తెలిపారు.

  • By: Somu    latest    Feb 09, 2024 12:57 PM IST
Minister Sridhar Babu | ఆటోడ్రైవ‌ర్ల‌కు ఏటా రూ.12 వేలు ఇస్తాం: మంత్రి పొన్నం
  • ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటాం
  • అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు
  • బెంజ్ కార్లు దిగ‌ని ఫ్యూడ‌ల్స్ బీఆరెస్ నేత‌లు
  • మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాలా వ‌ద్దా?
  • బీఆరెస్‌నేత‌లు స్ప‌ష్టంగా చెప్పాల‌ని డిమాండ్ చేసిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌


Minister Sridhar Babu | విధాత‌: అటోడ్రైవ‌ర్ల‌సంక్షేమానికి ఏటా రూ.12 వేల ఆర్థిక స‌హాయం అంద‌జేస్తామ‌ని ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని తెలిపారు. ఈ మేర‌కు శుక్ర‌వారం అసెంబ్లీలో బీఆరెస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పల్లా లేవనెత్తిన సమస్యపై ఆయన సమధానమిస్తూ చిన్నచిన్న సమస్యలు వస్తాయనే మ్యానిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అభయమిచ్చిందన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.


వచ్చే బడ్జెట్ లో దీనిని కచ్చితంగా నిధులు కేటాయించి అమలు చేస్తామని స్పష్టం చేశారు. “రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో ఎలాంటి భేషజాలు లేవు. అభివృద్ధి అనేది నిత్యం కొనసాగుతుంది. అందరికి అవకాశం ఇవ్వాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం, ఒకరిద్దరికే అవకాశం ఇవ్వొద్దని రాహుల్ గాంధీ చెప్పారు. పెట్టుబడుదారులను రాష్ట్రానికి స్వాగతిస్తాం తెలంగాణ అభివృద్ధిపై సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. రాజకీయాలు పదిలి రాష్ట్ర ప్రగతిపై మాట్లాడదాం” అని హితవు పలికారు.


బెంజ్ కార్లు దిగ‌ని వారు కూడా..


అధికారంలో ఉండి బెంజ్ కార్లు దిగ‌ని బీఆరెస్ నేత‌లు ఏ నాడు కూడా అటో డ్రైవ‌ర్ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోలేద‌ని ఇవ్వాళ వారి గురించి మాట్లాడుతున్నార‌ని మ‌రో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఎద్దేవా చేశారు. బెంజ్ కార్లు దిగ‌ని అహంకార పూరిత ఫ్యూడ‌ల్స్ నేడు అటోలో వ‌చ్చి వారిని అవ‌మాన ప‌రుస్తున్నార‌ని అన్నారు. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఇవ్వాలో వ‌ద్దో బీఆరెస్ నేత‌లు సూటిగా చెప్పాల‌ని నిల‌దీశారు. అటో డ్రైవ‌ర్ల‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఆటోలో వ‌చ్చిన బీఆరెస్ నేత‌ల‌ను పోలీస‌లు అసెంబ్లీ గేటు ముందు అడ్డుకున్నారు.