Hanmakonda | హ‌నుమ‌కొండ‌లో దారుణం.. వివాహితపై ఆటో డ్రైవ‌ర్ల లైంగిక‌దాడి

Hanmakonda | ఆమె సాయం అడ‌గ‌డ‌మే పాప‌మైంది. ఓ ముగ్గురు ఆటో డ్రైవ‌ర్లు క‌లిసి ఆమెపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న హ‌నుమ‌కొండ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఏప్రిల్ 27వ తేదీన చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. హ‌నుమ‌కొండ న‌యీంన‌గ‌ర్ స‌మీపంలో నివ‌సిస్తున్న వివాహిత ఏప్రిల్ 27వ తేదీన ప‌నిమీద బ‌య‌ట‌కు వెళ్లింది. తిరిగి అర్ధ‌రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో ఇంటికి బ‌య‌ల్దేరింది ఆమె. అర్ధ‌రాత్రి కావ‌డంతో కాక‌తీయ యూనివ‌ర్సిటీ క్రాసింగ్ […]

Hanmakonda | హ‌నుమ‌కొండ‌లో దారుణం.. వివాహితపై ఆటో డ్రైవ‌ర్ల లైంగిక‌దాడి

Hanmakonda | ఆమె సాయం అడ‌గ‌డ‌మే పాప‌మైంది. ఓ ముగ్గురు ఆటో డ్రైవ‌ర్లు క‌లిసి ఆమెపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న హ‌నుమ‌కొండ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఏప్రిల్ 27వ తేదీన చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. హ‌నుమ‌కొండ న‌యీంన‌గ‌ర్ స‌మీపంలో నివ‌సిస్తున్న వివాహిత ఏప్రిల్ 27వ తేదీన ప‌నిమీద బ‌య‌ట‌కు వెళ్లింది. తిరిగి అర్ధ‌రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో ఇంటికి బ‌య‌ల్దేరింది ఆమె. అర్ధ‌రాత్రి కావ‌డంతో కాక‌తీయ యూనివ‌ర్సిటీ క్రాసింగ్ వ‌ద్ద వెళ్తున్న ఆటోను ఆమె ఆపింది. రంగ్‌బార్ వ‌ద్ద దింపాల‌ని ఆటో డ్రైవ‌ర్‌ను కోరింది.

స‌రైన‌ని చెప్పి ఆటో ఎక్కించుకున్న డ్రైవ‌ర్ రాకేశ్‌.. త‌న స్నేహితులైన ఆటో డ్రైవ‌ర్లు స‌న‌త్‌, స‌తీశ్‌కు ఫోన్ చేసి త‌న ఆటోలో ఎక్కించుకున్నాడు. ఇక ఆటోను రంగ్‌బార్ వైపు తీసుకెళ్ల‌కుండా భీమారం వైపు తీసుకెళ్లారు. త‌న‌ను ఎక్క‌డికి తీసుకెళ్తున్నారంటూ మ‌హిళ గ‌ట్టిగా అరిచింది. అర‌వొద్దంటూ స‌న‌త్, స‌తీశ్ బెదిరించారు.

భీమారం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్క‌డ ఆటోలోని సౌండ్ బాక్స్ శ‌బ్దం భారీగా పెంచారు. ఇక ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఆమెపై అత్యాచారం చేశారు. అనంత‌రం ఆమెను రంగ్‌బార్ వ‌ద్ద వ‌దిలేసి వెళ్లిపోయారు. జ‌రిగిన విష‌యాన్ని వివాహిత త‌న కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేసింది. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బాధితురాలు శుక్ర‌వారం హ‌నుమ‌కొండ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు ఆటో డ్రైవ‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు.