Miyazaki Mango | ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్‌లీ.. కిలో రూ. 2.50 లక్షలు
Miyazaki Mango | మామిడి పండ్ల పేరు విన్నా.. వాటిని చూసినా నోట్లో నీళ్లూరుతాయి. బంగారు పసుపు వర్ణంలో ఉండే మామిడి పండ్లను ఎప్పుడు తినేయాలా..? అని అత్రుత పడుతుంటాం. బంగినపల్లి, తోతాపురి, రత్నగిరి అల్ఫాన్సో, హిమాయత్ వంటి రకానికి చెందిన మామిడి పండ్లు మహా అంటే కిలో రూ. 100 చొప్పున కొనుగోలు చేస్తాం. కానీ ఊదా రంగులో ఉండే మామిడి పండ్లను తినాలంటే అదృష్టం ఉండాలి. జపాన్‌లో అత్యధికంగా పండే మియాజాకీ రకానికి చెందిన […]

Miyazaki Mango | మామిడి పండ్ల పేరు విన్నా.. వాటిని చూసినా నోట్లో నీళ్లూరుతాయి. బంగారు పసుపు వర్ణంలో ఉండే మామిడి పండ్లను ఎప్పుడు తినేయాలా..? అని అత్రుత పడుతుంటాం. బంగినపల్లి, తోతాపురి, రత్నగిరి అల్ఫాన్సో, హిమాయత్ వంటి రకానికి చెందిన మామిడి పండ్లు మహా అంటే కిలో రూ. 100 చొప్పున కొనుగోలు చేస్తాం.
కానీ ఊదా రంగులో ఉండే మామిడి పండ్లను తినాలంటే అదృష్టం ఉండాలి. జపాన్‌లో అత్యధికంగా పండే మియాజాకీ రకానికి చెందిన మామిడి పండ్లే ఈ ఊదా రంగు మామిడి పండ్లు. అయితే ఈ పండ్లు మార్కెట్‌లో కిలో రూ. 2.50 లక్షల చొప్పున పలుకుతున్నాయి.
కర్ణాటకలోని కొప్పల్‌లో నిర్వహించిన మ్యాంగో మేళాలో ఈ మియాజాకీ మామిడి పండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక రైతులకు ఈ మామిడి పండ్లను పరిచయం చేసేందుకు జపాన్ నుంచి ఈ పండ్లను తీసుకొచ్చినట్లు మేళాలో ప్రదర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఒక్కో పండును రూ. 40 వేలకు కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఒక్కో కిలోకు ఐదు నుంచి ఆరు పండ్లు వస్తాయని చెప్పారు. మియాజాకీ మామిడి పండ్ల స్టాల్‌ను రైతులు, ప్రజలు ఆసక్తిగా సందర్శిస్తున్నారు. అక్కడ సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు.