Prabhas | జపాన్‌లో భూకంపం.. ప్రభాస్ ఎలా ఉన్నాడని ఫ్యాన్స్‌లో టెన్షన్.. మారుతి క్లారిటీ
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నారు. ‘బాహుబలి: ది ఎపిక్’ జపాన్ విడుదల ప్రచారంలో భాగంగా అభిమానులతో కలిసి వివిధ ఈవెంట్‌ల్లో పాల్గొంటూ అక్కడ సందడి చేస్తున్నారు.
Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నారు. ‘బాహుబలి: ది ఎపిక్’ జపాన్ విడుదల ప్రచారంలో భాగంగా అభిమానులతో కలిసి వివిధ ఈవెంట్‌ల్లో పాల్గొంటూ అక్కడ సందడి చేస్తున్నారు. జపాన్ ప్రేక్షకుల్లో ప్రభాస్‌కు ఉన్న అపారమైన క్రేజ్ దృష్ట్యా, ఆయన అక్కడి ప్రతి కార్యక్రమం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఇదే సమయంలో జపాన్ ఉత్తర తీర ప్రాంతాన్ని భారీ భూకంపం వణికించడంతో ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో జరిగిన ఈ భూకంపం, అమోరి, హొక్కైడో ప్రాంతాలకు సమీపంలో నమోదై, పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ వార్త వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో ప్రభాస్ సేఫ్టీపై వరుస పోస్టులు వెల్లువెత్తాయి.
“ప్రభాస్ పూర్తిగా సేఫ్” – దర్శకుడు మారుతి భరోసా
అభిమానుల్లో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో, ప్రభాస్‌తో కలిసి ‘ది రాజాసాబ్’ తెరకెక్కించిన దర్శకుడు మారుతి స్వయంగా స్పందించారు. ఒక అభిమాని మారుతిని ట్యాగ్ చేస్తూ హీరో క్షేమం గురించి అడిగిన ప్రశ్నకు మారుతి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ప్రభాస్‌తో ఇప్పుడే మాట్లాడాను. భూకంపం వచ్చిన ప్రాంతంలో ఆయన లేరు. పూర్తిగా క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు” అని మారుతి తెలిపిన వెంటనే అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అతని సమాధానం సోషల్ మీడియాలో పాజిటివ్‌గా వైరల్ అవుతూ, “మా హీరో సేఫ్ అనే మాట చాలూ!” అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమోషన్‌లతో సందడి చేస్తున్న ప్రభాస్
‘బాహుబలి’ వల్ల జపాన్‌లో ప్రభాస్‌కు ఎందరో అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు డిసెంబర్ 12 విడుదలకానున్న ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్ వివిధ నగరాల్లో ఆడియన్స్‌ను కలుస్తూ, ఈవెంట్‌లలో పాల్గొంటున్నారు. ప్రతి కార్యక్రమంలోనూ ఆయనకు లభిస్తున్న ఆదరణ అద్భుతంగా ఉందని వీడియోలు, ఫోటోలు చెబుతున్నాయి.
‘ది రాజాసాబ్’ జనవరి 9న విడుదల
మరోవైపు ప్రభాస్–మారుతి కాంబినేషన్‌లో రూపొందిన ‘ది రాజాసాబ్’ చిత్రం జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే రెండో పాటను విడుదల చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి జపాన్‌లో సంభవించిన భూకంపం ప్రభాస్ అభిమానుల్లో ఒకసారికి గుబులు పుట్టించినప్పటికీ, దర్శకుడు మారుతి ఇచ్చిన భరోసా అందరికీ పెద్ద ఊరటనిచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ జపాన్‌లో సేఫ్‌గా ఉన్నారు, ప్రమోషన్ కార్యకలాపాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram