MLA SEETHAKKA PA | రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏ మృతి
MLA SEETHAKKA PA | విధాత: ములుగు జిల్లాకేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక శాసన సభ్యురాలు సీతక్క పీఏ కొట్టి వెంకటనారాయణ అలియాస్ జబ్బర్ మృతి చెందారు. జబ్బర్ ద్విచక్రవాహనంలో వెళుతుండగా సాధన స్కూల్ వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనున్న డివైడర్‌ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన వివరాలు పూర్తిగా తెలియరావాల్సి ఉంది. జబ్బర్ చాలా ఏళ్లుగా ఎమ్మెల్యే సీతక్కకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సీతక్క […]
MLA SEETHAKKA PA |
విధాత: ములుగు జిల్లాకేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక శాసన సభ్యురాలు సీతక్క పీఏ కొట్టి వెంకటనారాయణ అలియాస్ జబ్బర్ మృతి చెందారు. జబ్బర్ ద్విచక్రవాహనంలో వెళుతుండగా సాధన స్కూల్ వద్ద ప్రమాదం జరిగింది.
రోడ్డు పక్కనున్న డివైడర్‌ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన వివరాలు పూర్తిగా తెలియరావాల్సి ఉంది. జబ్బర్ చాలా ఏళ్లుగా ఎమ్మెల్యే సీతక్కకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సీతక్క బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహం వద్ద నివాళులర్పించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram