MLC Kavitha | కవిత పిటిషన్ విచారణ 26కు వాయిదా
సీబీఐ విచారణపై సవాల్
విధాత, హైదరాబాద్ : సీబీఐ విచారణను సవాల్ చేస్తూ బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది. సీబీఐ విచారణకు సంబంధించి తమకు రిప్లై కాపీ ఇవ్వలేదని, సీబీఐ కవితను 6వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకే విచారించిందని, విచారణ ఆర్డర్ సాయంత్రం 5:30 గంటలకు అందిందని, ఆర్డర్ రాకుండానే సీబీఐ విచారణ జరిపిందని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
ముందుగా విచారించాలంటే మరోసారి అప్లికేషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని జడ్జి సూచించారు. సీబీఐ న్యాయవాది మాత్రం తాము రిప్లై కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటికే తాము తీహార్ జైలులో కవితను విచారించామని కోర్టుకు నివేదించారు. 26వ తేదీన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ చెప్పింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు కవిత పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేస్తూ ప్రత్యేక కోర్టులో వాదనలు వింటామని తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram