MLC Kavitha | రాజీవ్‌ విగ్రహ ఏర్పాటుపై పునరాలోచన చేయాలి : ఎమ్మెల్సీ కవిత

సచివాలయ ప్రాంగణంలో రాజీవ్‌ గాంధీ విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.

MLC Kavitha | రాజీవ్‌ విగ్రహ ఏర్పాటుపై పునరాలోచన చేయాలి : ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha | సచివాలయ ప్రాంగణంలో రాజీవ్‌ గాంధీ విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ఈ అంశంపై శాసనమండలిలో సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్‌ అనుమతి కోరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.


ఆ స్థానంలో రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్‌ గాంధీపై తమకు అపారమైన గౌరవం ఉందని.. కానీ తెలంగాణ తల్లి తెలంగాణకు అత్యంత ముఖ్యమన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.