Madhavaram Krishna Rao : మీ బండారం విప్పితే..తట్టుకోలేవు: ఎమ్మెల్యే మాధవరం
కవిత విమర్శలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ బండారం విప్పితే తట్టుకోలేవని హెచ్చరిస్తూ పలు ఆరోపణలు చేశారు.
విధాత, హైదరాబాద్ : తనను కబ్జాదారులు అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించడంపై కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను నీ గురించి చెబితే ..నీ బండారాన్ని తెలంగాణ నుంచి ఢిల్లీదాక విప్పితే తట్టుకోలేవు అని, నీ తల ఎక్కడ పెట్టుకుంటావో తెలియదు అని హెచ్చరించారు. మీ నాయన కేసీఆర్ పేరు అడ్డం పెట్టుకుని బట్టల షాపులు, బంగారు షాపులను ఎవర్ని వదలకుండా దోచుకున్నావని…నువ్వు నన్ను విమర్శిస్తావా? అని ఫైర్ అయ్యారు. నీ అత్తగారి ఊర్లో ఎంపీగా గెలవడం చేతకాని నీవు మాపై మాట్లాడుతావా?” అంటూ ఎద్దేవా చేశారు. బాలానగర్ లో కవిత, ఆమె భర్త కబ్జాల చిట్టా ఉందని, ఓవర్ ల్యాప్ ల్యాండ్ ని….పార్టీ పేరు చెప్పుకొని 36 ఎకరాల భూమిని దోచుకుందని విమర్శించారు. ట్రక్ పార్కు గురించి కవితకు ఏం తెలుసు .. కే.పి.హెచ్.బిలో స్కూల్ మేము కడుతున్నాం..ఏం తెలుసు నీకు అని విమర్శించారు.
నా నియోజకవర్గంలో కవిత పర్యటన ఉందని తాను భయపడిపోయానంటూ ఆమె చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నీలాంటి కుక్కలు నా నియోజకవర్గానికి మస్తుగా వచ్చిపోయారంటూ ఘాటు విమర్శలు చేశారు. స్థానిక ప్రజలే నాకు దేవుళ్లు అన్నారు. సీఎం, కేంద్రం సీరియస్ గా తీసుకుంటే మీ సంగతేమిటో మొత్తం బయటకొస్తుందన్నారు. జిల్లాలలో తిరుగుతూ ఎమ్మెల్యేలను తిట్టడం..తర్వాతా వారితో సెటిల్ చేసుకోవడం అలవాటుగా పెట్టుకుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అమ్ముకున్నదని కృష్ణారావు ఆరోపించారు. హరీష్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టి, సీఎం రేవంత్ రెడ్డితో కేటీఆర్ ను జైలుకు పంపించి పార్టీని ఆధీనంలోకి తీసుకుని రాష్ట్రాన్ని దోచుకునేందుకు కుట్ర చేసిందని విమర్శించారు.
నేను తెలంగాణ ఉద్యమం చేసినా అని ఎప్పుడు చెప్పలేదని..ఆనాడు టీడీపీ విధానాల మేరకు పనిచేశామన్నారు. నీలాగా మేం చెట్టుపేరుచెప్పి కాయలు అమ్ముకోలేదన్నారు. గాంధీ మాదిరిగా పేరు ఉన్న కేసీఆర్ పరువు తీస్తుందన్నారు. నీకు ఉద్యమకారులపై ప్రేమ ఉంటే నీ ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు వారికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.హైదరాబాద్ ఎమ్మెల్యేల పై గౌరవం లేకుండా అవినీతి పరులంటూ విమర్శించడం సరికాదన్నారు. చరిత్ర హినురాలు కవిత మమ్మల్నివిమర్శించే అర్హత లేదు అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం హైదరాబాద్ ఎమ్మెల్యే లు కలిసి నడుస్తున్నాం అన్నారు. నగరంలో ఉండే ఎమ్మెల్యేలు బీ.టీ బ్యాచ్ అని ఎమ్మెల్సీ కవిత విమర్శించడాన్ని తప్పుబట్టారు. ఉద్యమంలో పనిచేయకపోయేనా తాము అందరం తెలంగాణ కోసం పని చేశాం అన్నారు. తెలంగాణ చరిత్ర ను లిక్కర్ పేరుతో కవిత నాశనం చేసిందని విమర్శించారు. చివరకు ఇంట్లో కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకుందని..మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన నన్ను అనే స్థాయి ఆమెకు లేదు అన్నారు. పదేళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకుందని, కవిత ఉంటున్న ఇప్పటి ఇల్లు వంటిది..మాజీ సీఎం కేసీఆర్ కు కూడా లేదు అన్నారు.
ఇవి కూడా చదవండి :
Silver Price : 2లక్షల మార్క్ వైపు.. వెండి ధర పరుగు
Snake Jumps In Air To Hunt Bird : షాకింగ్ వీడియో..ఆకాశంలో పక్షిని వేటాడిన పాము!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram