Snake Jumps In Air To Hunt Bird : షాకింగ్ వీడియో..ఆకాశంలో పక్షిని వేటాడిన పాము!
ఆకాశంలో పక్షిని వేటాడిన పాము వీడియో వైరల్. నేల నుంచి ఎగిరి పక్షిని పట్టేసిన పాము అద్భుతం చూసి నెటిజన్లు షాక్. వన్యప్రాణి వేట విధానం ఆశ్చర్యం.
విధాత : కోటానుకోట్ల జీవరాశుల ప్రకృతిలో అద్బుతాలు..వింతలతో మనుగడ సాగించే జీవుల కార్యకలాపాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆహారం కోసం వన్యప్రాణులు, సరీసృపాలు అసాధారణ రీతిలో వేటలు సాగించడం అప్పడప్పుడు వెలుగుచూస్తుంటాయి. అయితే ఓ పాము ఏకంగా ఆకాశ మార్గంలో సాగిపోతున్న పక్షిని వేటాడిన వీడియో ఇప్పుడు ఇంటర్నేట్ ను షేక్ చేస్తుంది.
ఓ సన్నని పొడువైన పాము నేల మీద ప్రయాణిస్తున్న క్రమంలో..అదే సమయంలో ఆకాశ మార్గంలో పక్షులు సాగిపోతున్నాయి. వాటిని గమనించిన పాము ఆకస్మాత్తుగా నేల మీద నుంచి గాలిలోకి ఎగిరి ఓ పక్షిని నోట కరుచుకుని నేలపై ల్యాండ్ అయ్యింది. ఆ పాము చేసిన ఈ అద్బుతానికి సంబంధించి వీడియో చూసిన నెటిజన్లు మైండ్ బ్లాక్ అయిపోగా.. నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్ గా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆఫ్రికన్ జాతికి చెందిన ఈ పాము ఎక్కువగా..వృక్షాలు, కొండలు వంటి ఎత్తైన ప్రాంతాల్లో సంచరిస్తూ ఆకాశంలో ప్రయాణించే పక్షుల కోసం పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సెకన్ల కంటే తక్కువ వ్యవధిలో తను ఎంచుకున్న ఆహార ప్రాణిపై దాడి చేస్తుంటాయని తెలిపారు.
అమెజాన్ తీర ప్రాంతంలో అనకొండలే పొడవైన, భారీ అనకొండలకు నెలవుగా భావిస్తుంటారు. మనదేశంలో గిరినాగులు(కింగ్ కోబ్రా)లు ప్రత్యేకమైనవి. అయితే పురాణ ఇతీహాసాల్లో భారతదేశంలో పొడవైన శేషనాగ్, వాసుకి పాముల కథలు బాగా ప్రసిద్ధి చెందాయి. ప్రపంచంలో ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద పాముశిలాజం(వాసుకీ) భారత్‌లోనే లభించింది. పాములను శక్తికి గుర్తుగా, రక్షకుడిగా భావించడం మన భారతీయ సంస్కృతికి ప్రత్యేకత. అంతర్జాతీయంగా కూడా పాములు పలు మతాల్లో కనిపిస్తాయి. అయితే పాములు ప్రాణాంతకమైనప్పటికి ఇవి ప్రకృతి సమతుల్యతకు ఎంతో మేలు చేస్తాయి.
— African prides (@rungunyika) December 8, 2025
ఇవి కూడా చదవండి :
TVK Vijay| విజయ్ సభలో గన్ తో కార్యకర్త కలకలం
Revanth Reddy| స్వయం పాలనకు స్ఫూర్తి తెలంగాణ తల్లి : సీఎం రేవంత్ రెడ్డి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram