Revanth Reddy| స్వయం పాలనకు స్ఫూర్తి తెలంగాణ తల్లి : సీఎం రేవంత్ రెడ్డి

స్వరాష్ట్రంలో స్వయం పాలనకు స్ఫూర్తి..తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. జిల్లాల కలెక్టరేట్లలోని తెలంగాణ తల్లి విగ్రహాల వర్చువల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Dec 10, 2025, 12:16 am IST
Read Time: 4 mins
Revanth Reddy| స్వయం పాలనకు స్ఫూర్తి తెలంగాణ తల్లి : సీఎం రేవంత్ రెడ్డి

స్వయం పాలనకు స్ఫూర్తి తెలంగాణ తల్లి : సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : స్వరాష్ట్రంలో స్వయం పాలనకు స్ఫూర్తి..తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Mother statue) ఏర్పాటు అని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)అభివర్ణించారు. జిల్లాల కలెక్టరేట్లలోని తెలంగాణ తల్లి విగ్రహాల వర్చువల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. డిసెంబర్ 9, 2009 న సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజు అని గుర్తు చేశారు. ఆ ప్రకటన తెలంగా ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది.. ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వంలో ఈ రోజుని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం తెలిపారు. అందులో భాగంగానే గత ఏడాది సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పరిపాలనలో ఒక స్ఫూర్తి తీసుకొచ్చాం అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం అని పేర్కొన్నారు.

తెలంగాణ తల్లిని తలచుకుని పనులు మొదలుపెట్టేందుకే వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తు చేశారు. సోనియాగాంధీ ఎన్నో అడ్డంకులను అధిగమించి మరీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. మా పథకాలు, కార్యక్రమాల్లో సోనియా, మన్మోహన్‌సింగ్‌ స్ఫూర్తి కొనసాగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు.

2004 లో కరీంనగర్ గడ్డపై నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ మాట ఇచ్చారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9వ తేదీ కావడం విశేషం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలను జరుపుకుంటాం అని తెలిపారు.