Kukatpally | హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పద్మావతి ప్లాజా సెంటర్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లోని మొబైల్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దుకాణంలోని మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.