Medak: గాంధీనగర్ బస్తీల అభివృద్ధికి రూ.10 లక్షల నిధులు: MLC సుభాష్ రెడ్డి
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ పట్టణంలోని గాంధీనగర్‌కు సంబంధించిన పలు బస్తీల్లో ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతితో కలిసి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పర్యటించి బస్తీవాసులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు. మొదటగా బుడగ జంగాల బస్తీకి వెళ్లిన ఎమ్మెల్సీ అక్కడి మహిళలు, బస్తీ వాసులతో మాట్లాడి సానుకూలంగా స్పందించారు. బుడగ జంగాల బస్తీలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి తన సిడిపి నిధుల నుంచి రూ.5లక్షలను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ […]

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ పట్టణంలోని గాంధీనగర్‌కు సంబంధించిన పలు బస్తీల్లో ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతితో కలిసి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పర్యటించి బస్తీవాసులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు.
మొదటగా బుడగ జంగాల బస్తీకి వెళ్లిన ఎమ్మెల్సీ అక్కడి మహిళలు, బస్తీ వాసులతో మాట్లాడి సానుకూలంగా స్పందించారు. బుడగ జంగాల బస్తీలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి తన సిడిపి నిధుల నుంచి రూ.5లక్షలను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రకటించారు.
అనంతరం హనుమాన్ ఆలయ వీధిలో పర్యటించి అసంపూర్తిగా ఉన్న మహాత్మ గాంధీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయడానికి తన సిడీపీ నిధుల నుంచి రూ.5 లక్షలను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ప్రకటించారు. ఈ రెండు కమ్యూనిటీ హల్‌ల నిర్మాణం పూర్తి అయ్యేవరకు నిధుల కేటాయింపే కాక పనిని ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి త్వరగా పూర్తి చేయిస్తానని ఎమ్మెల్సీ తెలిపారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి, బస్తీల నాయకులు, పార్టీ నాయకుడు ప్రశాంత్ రెడ్డి సర్పంచులు శ్రీకాంత్, శ్రీను నాయక్, యామి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రావు, యువ నాయకులు భాస్కర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.