Mohammedabad | పోలీస్‌స్టేషన్‌ను.. తనిఖీ చేసిన ఎస్పీ నరసింహ

Mohammedabad | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: జిల్లాలోని మహమ్మాదాబాద్ పోలీస్ స్టేషన్ ను బుధ వారం జిల్లా ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్వచ్ఛతపై అధికారులకు పలు సూచనలు చేసారు. ప్రతిరోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉంచాలని, ఆన్లైన్లో కేసుల నమోదు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషనుకు వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, సాంకేతికంగా ప్రతి ఒక్కరూ […]

  • By: krs    latest    Aug 16, 2023 1:33 PM IST
Mohammedabad | పోలీస్‌స్టేషన్‌ను.. తనిఖీ చేసిన ఎస్పీ నరసింహ

Mohammedabad |

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: జిల్లాలోని మహమ్మాదాబాద్ పోలీస్ స్టేషన్ ను బుధ వారం జిల్లా ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్వచ్ఛతపై అధికారులకు పలు సూచనలు చేసారు. ప్రతిరోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉంచాలని, ఆన్లైన్లో కేసుల నమోదు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషనుకు వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, డయల్ 100 నుంచి కాల్స్ వచ్చిన వెంటనే స్పందించాలని, పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్లో ఉంచరాదని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో DSP మహేష్, DCRB DSP వెంకటరమణ రెడ్డి, SP సీసీ రాంరెడ్డి, రూరల్ ఇన్స్పెక్టర్ స్వామి, SI సురేష్ మరియు IT Cell సిబ్బంది పాల్గొన్నరు.