Komatireddy | కాంగ్రెస్ ఏం చేయలేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు అసత్యాలు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Komatireddy | ఆయన రాజకీయ జీవితమే కాంగ్రెస్ నుంచి మొదలైందంటూ సెటైర్‌ బీఆరెస్ అభ్యర్థుల ఆస్తులపై సోషల్ మీడియా ప్రచారానికి పిలుపు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్‌ విధాత : కాంగ్రెస్ పార్టీ 50ఏళ్లలో ఏం చేయలేదంటూ సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అసత్యాలు..రాజకీయ విమర్శలేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. అసలు సీఎం కేసీఆర్ రాజకీయ జీవితమే కాంగ్రెస్ నుంచే మొదలైందన్న సంగతి మరువరాదన్నారు. కర్ణాటక, కూర్గ్ : బొగ్గు గనులు, ఉక్కు […]

  • By: Somu    latest    Aug 22, 2023 12:01 PM IST
Komatireddy | కాంగ్రెస్ ఏం చేయలేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు అసత్యాలు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Komatireddy |

  • ఆయన రాజకీయ జీవితమే కాంగ్రెస్ నుంచి మొదలైందంటూ సెటైర్‌
  • బీఆరెస్ అభ్యర్థుల ఆస్తులపై సోషల్ మీడియా ప్రచారానికి పిలుపు
  • ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్‌

విధాత : కాంగ్రెస్ పార్టీ 50ఏళ్లలో ఏం చేయలేదంటూ సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అసత్యాలు..రాజకీయ విమర్శలేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. అసలు సీఎం కేసీఆర్ రాజకీయ జీవితమే కాంగ్రెస్ నుంచే మొదలైందన్న సంగతి మరువరాదన్నారు. కర్ణాటక, కూర్గ్ : బొగ్గు గనులు, ఉక్కు ఆధారిత పరిశోధన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్ లో భాగంగా కర్ణాటకలోని కూర్గ్ లో జరుగుతున్న సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెంకట్‌రడ్డి కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలను త్రిప్పికొట్టారు. కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మించారన్న సంగతి సీఎం కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. సాగర్ ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలోని 11లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయన్నారు.

శ్రీశైలం,కల్వకుర్తి, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ హయంలోనేనన్నారు. కాంగ్రెస్ 70శాతం కట్టిన ప్రాజెక్టులను 30శాతం పూర్తి చేయకుండా సీఎం కేసీఆర్ కాళేశ్వరం పేరుతో వేలకోట్ల అవినీతికి పాల్పడ్డాడన్నారు. కాంగ్రెస్ హాయంలో చేపట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీకి 2వేల కోట్లు కేటాయిస్తే పూర్తేయ్యేదని పదేళ్లుగా దానిని పడకేయించారని విమర్శించారు. 50 ఏళ్లలో దేశాన్ని కాంగ్రెస్ అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేసిందన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలోనే సీఎం కేసీఆర్ కుటుంబం అధికారం వెలగబెడుతూ ఉద్యమకారుల ఆకాంక్షలకు విరుద్ధంగా అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన సాగిస్తుందన్నారు. కాంగ్రెస్ హయంలో ఒకటో తారీఖుకల్లా పింఛన్ డబ్బుల, జీతాలు ఇచ్చామని, బీఆరెస్‌ ప్రభుత్వంలా 15 తేదీకి ఇవ్వడం లేదన్నారు. దేశంలో ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీయేనన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం కనీసం ఉస్మానియా యూనీవర్సిటీలో కనీసం బాత్ రూంలు కూడా కట్టించలేక పోయిందన్నారు. యూనీవర్సిటీల్లో ఎక్కడా కూడా ప్రభుత్వ ప్రొఫెసర్లు లేరని, కనీసం కాంట్రాక్ట్ స్టాఫ్ కూడా లేరన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని ఐదులక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లిన కేసీఆర్ కు కాంగ్రెస్ ను అడిగే హక్కు లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయంలో 32లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. కేసీఆర్ సర్కార్ ఓట్ల కోసం ప్రజలను ఎన్నికల ముందు సంక్షేమ పథకాల పేరుతో మోసం చేస్తోందన్నారు.

ప్రతి ఒక్కరు ఓటు వేసే ముందు గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ఉద్యమాకారులు ,నిరుద్యోగులరా.. కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల ఆస్తులు.. ఎమ్మెల్యేలు కాకముందే ఎంత… అయ్యాక ఎంత పెరిగిందనే వివరాలను సేకరించి సోషల్ మీడియా అకౌంట్ లలో షేర్ చేయ్యండంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు, రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు, ప్రజలు తమవంతు కృషి చేయాలన్నారు.